Rishabh Pant Fined Vs Chennai Super Kings: వరుస రెండు మ్యాచ్‌ల్లో ఓటమి తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 20 రన్స్‌ తేడాతో ఓడించి.. ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ (32 బంతుల్లో 51, 4 ఫోర్లు, 3 సిక్సులు) రీఎంట్రీలో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. పంత్ చివర్లో దూకుడుగా ఆడడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. పంత్‌కు తోడు వార్నర్ (52), పృథ్వీషా (43) రాణించారు. ఛేజింగ్‌లో చెన్నై ఆరంభం నుంచే తడపడింది. చివర్లో మాత్రం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెరుపులతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి పాత ధోనీని గుర్తు చేశాడు. ధోనీ క్రీజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి స్టేడియం అరుపులతో మార్మోమోగిపోయింది. ధోనీ చెలరేగినా.. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో చెన్నై ఓటమి ఖాయమైపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MLC Election Counting: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం భారీ షాక్‌.. ఓట్ల లెక్కింపు వాయిదా


ఇక ఈ మ్యాచ్‌ తరువాత ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు షాక్ తగిలింది. దురదృష్టవశాత్తు 12 లక్షల రూపాయల భారీ జరిమానాకు గురయ్యాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో జట్టు స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు పంత్‌కు జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం మినిమమ్ ఓవర్ రేట్‌కు సంబంధించి పంత్ మొదటి నేరం కింద జరిమానాతో సరిపెట్టారు. ఈ సీజన్‌లో స్లో ఓవర్‌ రేట్ కారణంగా జరిమానాకు గురైన రెండో కెప్టెన్ పంత్. గత మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ.12 లక్షల జరిమానాకు గురయ్యాడు. 


“మేము మా తప్పులను సరిదిద్దుకుని బాగా సన్నద్దమయ్యాం. పృథ్వీ షా గత రెండు వారాల నుంచి కష్టపడుతున్నాడు. అతడికి అవకాశం ఇవ్వడమే తరువాయి.. విజృంభించి ఆడాడు. ఇది మ్యాచ్ టు మ్యాచ్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖేష్ కుమార్‌ బౌలింగ్ డెత్ ఓవర్లలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక క్రికెటర్‌గా నేను నా 100 శాతం ఇవ్వాలి. గత ఏడాదిన్నర కాలంగా నేను పెద్దగా క్రికెట్ ఆడనందున సెట్ అయ్యేందుకు మొదట్లో కొంత సమయం పట్టింది. ఇది నేను నా జీవితంపై ఆధారపడిన విషయం. ఏది జరిగినా మళ్లీ మైదానంలోకి రావడమే ముఖ్యమన్న ఆత్మవిశ్వాసంతో నేను ఉన్నాను..' అని చెన్నైపై విజయం అనంతరం పంత్ చెప్పాడు. ఏప్రిల్ 3న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. 


Also Read:  Jasprit Bumrah love story: జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేశన్ లవ్ స్టోరీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి