Rishabh Pant Video: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్.. ప్రస్తుతం కోలుకునే పనిలో బిజీగా ఉన్నాడు. టీమిండియా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల స్టిక్ సాయంతో అడుగులు వేస్తున్న పిక్ ఫొటో షేర్ చేసిన పంత్.. తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌లో నడుస్తున్న వీడియోను పంచుకున్నాడు. స్విమ్మింగ్ పూల్‌లో స్టిక్ పట్టుకుని.. నడుస్తున్నాడు. ఈ చిన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిన్న విషయాలకు.. పెద్ద విషయాలకు.. అన్ని విషయాలకు తాను కృతజ్ఞుడనంటూ క్యాప్షన్ ఇచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. హైవేపై జరిగిన ఘోర ప్రమాదంలో తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. అటువైపు ప్రయాణిస్తున్న ఇద్దరు ట్రక్ డ్రైవర్లు అతని ప్రాణాలను కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కారు ప్రమాదం కారణంగా రిషబ్ పంత్ టీమిండియాకు దూరమయ్యాడుర. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు రిషబ్ పంత్‌ను చాలా మిస్ అయింది. పంత్ మైదానంలో అడుగుపెట్టేందుకు మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది.  


 




పంత్ తాజగా షేర్ చేసి వీడియోను చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. పంత్ త్వరలో మైదానంలోకి రాగలడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పంత్ ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవాలని యావత్ క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు. అయితే పంత్ లేటెస్ట్ వీడియో చూస్తుంటే ఇప్పుడు పంత్ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా మారిందని తెలుస్తోంది.


పంత్ ఇటీవల తన మనస్సులో ఏమి జరుగుతుందో రెండు పోస్ట్‌ల ద్వారా చెప్పడానికి ప్రయత్నించాడు. ఇన్‌స్టాగ్రామ్ కథనంలో ఒక చిత్రంలో చెస్ చిత్రాన్ని పంచుకున్నాడు. పంత్‌కు చెస్ ఆడటం అంటే చాలా ఇష్టం. క్రికెట్ ఫీల్డ్‌లో చదరంగంలో మాదిరి తక్షణమే మార్చేయడంలో అతడు నేర్పరి. ఇక పంత్ ఐపీఎల్‌కు దూరమవ్వడంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 


Also Read: IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.10 వేలతో ఈ ఐదు ఆలయాలను సందర్శించండి


Also Read: Kisan Vikas Patra: రైతులకు వరం కిసాన్ వికాస్ పత్ర.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి