Know More about Kisan Vikas Patra Scheme: దేశంలో రైతులకు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు ప్రవేశపెడుతోంది. వారిని పొదుపు దిశగా ప్రోత్సహిస్తూ.. మంచి వడ్డీ రేటు అందించే పథకాలను కూడా తీసుకువచ్చింది. వీటిలో కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) పథకం ఒకటి. ఈ పథకాన్ని పోస్టాఫీసు ద్వారా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మంచి వడ్డీ లభిస్తుంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇలా..
కిసాన్ వికాస్ పత్ర పథకం ద్వారా రైతులను పెట్టుబడి పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రైతులు మంచి రాబడిని పొందవచ్చు. ఈ పథకంలో రైతులు కనీసం రూ.1000తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అయితే గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. ప్రస్తుతం రైతులకు సమ్మేళనం ఆధారంగా ఏటా 7.2 శాతం వడ్డీ ఇస్తారు. ఇది బ్యాంకులు ఇచ్చి వడ్డీ రేటు కంటే ఎక్కువ. ఈ పథకంలో ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు. కేవీపీ ఖాతాను 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఒంటరిగా లేదా ఉమ్మడిగా (ముగ్గురు వ్యక్తుల వరకు) తెరవవచ్చు. 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్‌కు అనుకూలంగా సంరక్షకుడి ద్వారా కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
ఈ స్కీమ్ వ్యవధి 124 నెలలు ఉంటుంది. అంటే 10 ఏళ్ల 4 నెలలు. ఒకవేళ మీరు ఈ పథకంలో ఇప్పుడు పెట్టడం ప్రారంభిస్తే.. ఆ పెట్టుబడి పదేళ్లలో రెట్టింపు అవుతుంది. ఈ పథకం 1988లో ప్రారంభించారు. ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు లిమిట్ లేకపోవడంతో మనీ లాండరింగ్ ముప్పు ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం 2014లో 50 వేల రూపాయల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే.. పాన్‌కార్డ్ తప్పనిసరి చేసింది. 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే.. ఆదాయం ప్రూఫ్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.
మీకు కిసాన్ వికాస్ పత్ర పథకాన్ని మధ్యలో మూసివేయాలనుకుంటే.. మీరు పెట్టబడి ప్రారంభించిన తేదీ నుంచి 2 సంవత్సరాల 6 నెలల తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. ఒక ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి మరణిస్తే.. ఖాతాదారుని మరణ ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ద్వారా తనఖా పెట్టడం లేదా కోర్టు ఆర్డర్ వంటి ద్వారా అకౌంట్‌ను ముందస్తుగా మూసివేసేందుకు అనుమతి ఉంటుంది.
Also Read: IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.10 వేలతో ఈ ఐదు ఆలయాలను సందర్శించండి
Also Read: Facebook Layoffs: మెటా సంచలన నిర్ణయం.. 10 వేల ఉద్యోగాలు తొలగింపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook