Rishabh Pant meet Shaheen Shah Afridi ahead of India vs Pakistan Asia Cup 2022 clash: క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్‌ 2022 నేడు ఆరంభం కానుంది. ఆరంభం మ్యాచులో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఢీ కొట్టనున్నాయి. 28న దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇండో-పాక్ తలపడుతుండడంతో.. ఈ మెగా మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీ20 ప్రపంచకప్‌ 2021 పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే భారత్, పాకిస్థాన్ పోరు కేవలం మైదానానికే పరిమితం. ఇరు దేశాల క్రికెటర్లు బయట కలిసినప్పుడు చాలా సరదాగా మాట్లాడుకుంటారు. గాయం కారణంగా ఆసియా కప్‌ 2022కి దూరమైన పాకిస్తాన్ స్టార్‌ బౌలర్‌ షహీన్‌ షా అఫ్రిది.. భారత క్రికెటర్లను కలిసి మాట్లాడాడు. ఈ సందర్భంగా అఫ్రిదికి, రిషబ్ పంత్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ముందుగా గాయంతో ఉన్న అఫ్రిది వద్దకు వెళ్లిన అల్లరి పిల్లాడు యుజ్వేంద్ర చహల్‌ క్షేమ సమాచారం అడిగాడు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించాడు. అఫ్రిదితో చేతులు కలిపిన విరాట్‌ కోహ్లీ.. ఆరోగ్యం ఎలా ఉందిని అడిగాడు. జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.



రిషబ్ పంత్‌తో షహీన్‌ షా అఫ్రిది సరదాగా ముచ్చటించాడు. నీ కాలికి ఏమైందని పంత్‌ అడగ్గా.. ప్రస్తుతం తాను నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని బదులిచ్చాడు. నేను నీలా ఒంటి చేత్తో సిక్సులు కొట్టాలనుకుంటున్నా పంత్ అంటూ అఫ్రిది సరదాగా వ్యాఖ్యానించాడు. అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని పంత్‌ సమాధానమిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు పూశాయి. చివరగా అఫ్రిదిని కేఎల్‌ రాహుల్‌ కలిసి మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయింది. 


Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ను వేగంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఈ టీని తీసుకోండి..


Also Read: ఆస్కార్ బరిలోకి ఇండియన్ మూవీస్.. ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook