Rishabh Pant should open with KL Rahul says Wasim Jaffer: ఆస్ట్రేలియా గడ్డపై జరగబోయే టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం బీసీసీఐ సెలెక్టర్లు రెండు రోజుల క్రితం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించినప్పటి నుంచి ప్లేయింగ్ ఎలెవన్ మరియు జట్టు కలయికల గురించి మాజీలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. భారత మాజీ బ్యాటర్‌ వసీమ్‌ జాఫర్‌ కూడా తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ కాకుండా.. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌ బరిలోకి దిగాలని సూచించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్‌ 2022లో పటిష్ట భారత జట్టు సూపర్ 4 నుంచే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. కీలక మ్యాచులో ఓపెనర్ల విఫలమయ్యారు. మంచి భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోయారు. ఈ నేపథ్యంలో కీలక టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు వసీమ్‌ జాఫర్‌ బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు సూచించాడు. రోహిత్‌ శర్మ స్థానంలో కీపర్‌ రిషబ్ పంత్‌ను ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు పంపించాలని అభిప్రాయపడ్డాడు. రోహిత్‌ నాలుగో స్థానంలో రావాలన్నాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మిడిలార్డర్‌లో ఉన్న రోహిత్‌ను ఎలాగైతే ఓపెనింగ్‌కు పంపాడో.. ఇప్పుడు కెప్టెన్‌గా ఉన్న హిట్‌మ్యాన్ అలాంటి నిర్ణయమే తీసుకోవాలని జాఫర్‌ పేర్కొన్నాడు. 


'రిషబ్ పంత్‌ను ఓపెనింగ్‌కు పంపిస్తే.. అతడు తన బెస్ట్‌ ఇవ్వగలడని నేను భావిస్తున్నా. రోహిత్‌ శర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చు. 2013 ఛాంపియన్ ట్రోఫీలో రోహిత్‌ను ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు తీసుకువచ్చాడు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పంత్‌ను ఓపెనింగ్‌కు తీసుకురావడానికి ఇది సరైన సమయం. కేఎల్‌ రాహుల్, రిషబ్ పంత్‌, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్.. ఇదీ నా బ్యాటింగ్ ఆర్డర్‌' అని వసీమ్‌ జాఫర్‌ ట్వీట్ చేశాడు. 



వసీమ్‌ జాఫర్‌ టాప్ 5 బ్యాటింగ్ ఆర్డర్‌:
1) కేఎల్‌ రాహుల్
2) రిషబ్ పంత్‌
3) విరాట్ కోహ్లీ
4) రోహిత్‌ శర్మ
5) సూర్యకుమార్‌ యాదవ్


Also Read: Cobra OTT Release: అప్పుడే ఓటీటీలోకి విక్రమ్‌ 'కోబ్రా'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?  


Also Read: సరికొత్తగా ప్రమోషన్స్‌.. రాజకీయాల మాదిరి పాదయాత్ర మొదలెట్టిన హీరో నాగశౌర్య! ఇదే మొదటిసారి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook