Rishabh Pant Six: ప్రముఖ భారత యువ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒక ఆటగాడు గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం పెంచుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, రిషబ్ పంత్ గతంలో రిలేషన్షిప్ లో ఉన్నారని.. కానీ కొంతకాలం తర్వాత వీరి మధ్య మనస్పర్దాలు రావడంతో బ్రేకప్ అయ్యారు అని జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినా కూడా వీరి గురించి ఇప్పటికి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే గత ఏడాది డిసెంబర్ 30న  ఉత్తరఖండ్ కు తన కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రూర్కీ దగ్గర ఆయన కారు అదుపు తప్పి డివైడర్‎ ని ఢీకొట్టడంతో ఆయనకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే ముంబై ఆసుపత్రికి తరలించారు. ఇక అతడి మోకాలకు బాగా దెబ్బలు తాకడంతో శస్త్ర చికిత్స కూడా జరిగింది.


దీంతో కొంతకాలం ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. ఇక అతనికి ప్రమాదం జరిగిన సమయంలో చాలామంది ఊర్వశి షేర్ చేసే పోస్టులపై బాగా ఆసక్తి చూపించారు. రిషబ్ గురించి తను ఏదైనా సందేశం పంపిందేమో అని ఎదురు చూశారు. కానీ తను అంతగా పట్టించుకోనట్లు అనిపించింది. ఇక ఏదైతే ఏంటి మొత్తానికి రిషబ్ గాయాల నుండి బయటపడి రంగంలోకి అడుగు పెట్టాడు.


Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023 కు టీమ్ ఇండియా ప్లేయింగ్ 17 ఇదే, సూర్యకు స్థానం లేదా


బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పాల్గొని బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో దాదాపు 8 నెలల తర్వాత గ్రౌండ్ లోకి దిగాడు. అయితే ఈ సందర్భంగా ఆయన 77 వ స్వాతంత్రం దినోత్సవం రోజున ఏర్పాటు చేసిన జెఏఎస్ డబ్ల్యు ఫౌండేషన్ నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఆటకు సై అన్నాడు. ఇక తన భారీ షాట్లతో సిక్సులు కొడుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు.


ఫ్రంట్ ఫుట్ లో ఎక్స్ట్రా కవర్ మీదుగా ఆయన కొట్టిన సిక్స్ హైలెట్గా నిలిచింది. ఏకంగా బంతి మైదానం బయటపడటంతో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోకు ప్రాక్టీస్ మ్యాచ్లో రిషబ్ పంత్ సిక్సర్.. స్పైడీ పునరాగమనం కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది అని  క్యాప్షన్ ఇచ్చుకున్నారు. ఇక ఆ వీడియో చూసిన ఆయన అభిమానులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.  అంతేకాకుండా త్వరలో ఇంటర్నేషనల్ గ్రౌండ్ లోకి కూడా  వస్తాడని ఆశిస్తున్నారు.


Also Read: Nokia Latest 5G Phone 2023: క్విక్‌ఫిక్స్ సాంకేతికతతో మార్కెట్‌లోకి Nokia 5G మొబైల్స్‌..చీప్‌ ధరలకే ఫోన్స్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి