Rishabh Pant’s Coach Tarak Sinha Passes Away: ఆయన భారత క్రికెట్ జట్టు(India Cricket Team)కు గొప్ప గొప్ప ఆటగాళ్లను అందించారు. ఆయన పర్యవేక్షణలో ఎందరో క్రికెటర్లు రాటుదేలారు. ఆయనే ప్రముఖ క్రికెట్ కోచ్ తారక్ సిన్హా(Tarak Sinha). ఈయన ధావన్(shikhar dhawan), పంత్ లకు గురువు. 71 సంవత్సరాల తారక్ సిన్హా శనివారం ఢిల్లీలో క్యాన్సర్‎(Cancer)తో తుది శ్వాస విడిచాడు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సిన్హా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రాణాలు విడిచాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరణ్ సింగ్, రమాకాంత్ అచ్రేకర్, సునీతా శర్మ తర్వాత ద్రోణాచార్య అవార్డు(Dronacharya Award) అందుకున్న ఐదో భారత క్రికెట్ కోచ్ తారక్ సిన్హా నిలిచారు. 2018లో ఆయన ద్రోణాచార్య అవార్డు అందుకున్నాడు. న్యూఢిల్లీలో సోనెట్ క్రికెట్ క్లబ్‌ నడిపిన తారక్ సిన్హా చాలా కాలంపాటు క్రికెటర్లతో కలిసి పనిచేశారు. సిన్హా ఎందరో క్రికెటర్లను అందించారు. 


Also read: Rashid Khan To Ashwin: అశ్విన్, రషీద్ ఖాన్ మధ్య ఆసక్తికర సంభాషణ.. రషీద్ ఖాన్ తెలుగు ట్వీట్ వైరల్


ఈయన పర్యవేక్షణలో రాటుదేలిన ఆటగాళ్లలో 12 మంది అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆశిష్‌ నెహ్రా(Nehra), ఆకాశ్‌ చోప్రా, శిఖర్‌ ధావన్‌, అంజుమ్‌ చోప్రా, రిషబ్‌ పంత్‌, మనోజ్‌ ప్రభాకర్‌, అజయ్‌ శర్మ, కె.పి. భాస్కర్‌, సంజీవ్‌ శర్మ, రామన్‌ లంబా, అతుల్‌ వాసన్‌, సురేందర్‌ ఖన్నా, రణ్‌దీర్‌ సింగ్‌ లాంటివారు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ధావన్‌, పంత్‌(rishabh pant)లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తారక్ సిన్హా మృతిపై సోనెట్ క్లబ్ సంతాపం ప్రకటించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి