Road Safety World Series: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్‌లో ఇండియా లెజెండ్స్ సత్తా చాటింది. వెస్టిండీస్ లెజెండ్స్‌పై ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది. తద్వారా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. రాయపూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా లెజెండ్స్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 65, యువరాజ్ సింగ్ అజేయ 49 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అయితే వెస్టిండీస్ లెజెండ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు  206 పరుగులు చేయడంతో 12 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది.


Also Read: KL Rahul Duck Outs: కేఎల్ రాహుల్ 0, 1, 0, 0, అతడు ఛాంపియన్ అంటూ విరాట్ కోహ్లీ మద్దతు


47 ఏళ్ల సచిన్ టెండూల్కర్ 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది భారత ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 35, యూసఫ్ పఠాన్ 37 పరుగులతో రాణించారు. ఆల్ రౌండర్ యువరాజ్ వెస్టిండీస్ లెజెండ్స్ బౌలర్ మహేంద్ర నాగముత్తూ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 4 సిక్సర్లు సాధించాడు. దాంతో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేసింది.


Also Read: ICC Bans Cricketers: మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు క్రికెటర్లపై 8 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ



వెస్టిండీస్ కెప్టెప్ బ్రియాన్ లారా (46), డ్వేన్ స్మిత్ (63), నర్సింగ్ డియో నరైన్ (59 నాటౌట్) రాణించారు. కానీ చివర్లో ఇండియా లెజెండ్స్ బౌలర్ వినయ్ కుమార్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బ్రియాన్ లారా, టినో బెస్ట్ వికెట్లు తీసి వెస్టిండీస్ లెజెండ్స్‌ను దెబ్బ తీశాడు. చివరి ఓవర్లో విజయానికి 18 పరుగులు అవసరం కాగా, పఠాన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. తద్వారా ఇండియా లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ చేరుకుంది.


Also Read: Jasprit Bumrah Wedding Photos: టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా మ్యారేజ్ ఫొటో గ్యాలరీ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook