Road Safety World Series: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్‌లో ఇండియా లెజెండ్స్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు యువరాజ్ సింగ్. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ లెజెండ్స్‌పై 12 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ తొలి సెమీ ఫైనల్‌కు రాయపూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 200 పరుగులు చేస్తుందా లేదా అనే సమయంలో క్రీజులో ఉన్న యువరాజ్ సింగ్ సిక్సర్లతో చెలరేగాడు. ముఖ్యంగా వెస్టిండీస్ లెజెండ్స్ బౌలర్ మహేంద్ర నాగముత్తూ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో యువరాజ్ సింగ్(Yuvraj Singh) 4 సిక్సర్లు సాధించాడు. అందులో హ్యాట్రిక్స్ సిక్సర్లు ఉండటం గమనార్హం.


Also Read: Road Safety World Series: వెస్టిండీస్ లెజెండ్స్‌పై విజయంతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్లోకి India Legends


యువరాజ్ ఈజ్ బ్యాక్ అంటూ భారత క్రికెట్ ప్రేమికులు ట్వీట్లు చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్(Road Safety World Series)లో భాగంగా వెస్టిండీస్ లెజెండ్స్‌పై యువరాజ్ బాదిన సిక్సర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువీతో పాటు, టీమిండియా లెజెండ్స్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 65, యువరాజ్ సింగ్ అజేయ 49 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అయితే వెస్టిండీస్ లెజెండ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.


Also Read: Jasprit Bumrah Wedding Photos: టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా మ్యారేజ్ ఫొటో గ్యాలరీ 



తన బౌలింగ్‌లో యువరాజ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో నాలుగో బంతిని యార్కర్ సంధించాడు. ఆపై అదే ఏకాగ్రతతో 5వ బంతిని సైతం యువరాజ్ సిక్సర్‌గా మలుచుతూ స్టాండ్స్‌లోకి పంపించాడు. తన బ్యాటింగ్‌లో సత్తా ఇంకా తగ్గలేదని, మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగలనని మరోసారి నిరూపించుకున్నాడు. యువీ ఇన్నింగ్స్ కారణంగా చేసిన అత్యధిక పరుగులను విండీస్ లెజెంట్స్ ఛేదించలేకపోయింది.


Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook