Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్
Rohit Sharma Crying Video: రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ కళ్ల దగ్గర చేయి పెట్టుకుని నిరాశగా ఉన్నాడు. రోహిత్ శర్మ విచారానికి కారణం ఏంటి..?
Rohit Sharma Crying Video: ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ తప్పుకుంది. స్టార్ ప్లేయర్లు ఉన్నా వరుస ఓటములతో అన్ని జట్ల కంటే ముందే తట్టాబుట్టా సర్దేసింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలుపుతో వరుసగా ఓటముల నుంచి గట్టేక్కింది. ముంబై మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కంటిన్యూ అవుతోంది. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ను మినహా.. రోహిత్ శర్మ మళ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కాగా.. హైదరాబాద్ మ్యాచ్ తర్వాత హిట్‌మ్యాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడుస్తున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read: Vijayashanthi: విజయశాంతి ఎక్కడా? ప్రచారంలో కానరాని రాములమ్మ.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా?
డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని.. హిట్‌మ్యాన్ చాలా విచారంగా కనిపించడం వీడియోలో కనిపిస్తోంది. రోహిత్ ముఖంలో దుఃఖంతోపాటు చిరాకు పడుతున్నట్లు ఉంది. అయితే రోహిత్ శర్మ ఏడుస్తున్నాడా లేదా అనేది స్పష్టంగా కనిపించడం లేదు. తన బ్యాటింగ్ పట్ల హిట్‌మ్యాన్ సంతోషంగా లేడనేది స్పష్టంగా తెలుస్తోంది. గత 6 మ్యాచ్‌ల్లో విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తరువాత మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై డకౌట్ అయ్యాడు. నాలుగో, ఐదో మ్యాచ్‌ల్లో వరుసగా 49, 38 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపినా.. ఆ తరువాత 6 మ్యాచ్‌ల్లో వరుసగా 36, 6, 8, 4, 11, 4 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేశాడు. రికార్డుల పరంగా ఇది చెత్త ప్రదర్శన కాకపోయినా.. చివరి ఆరు మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ ఫామ్ దారుణంగా ఉంది.
ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్.. కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. మరో 2 గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అవకాశాల్లేవు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ ఈ రెండు మ్యాచ్‌ల్లో ఫామ్‌లో రావాల్సిన అవసరం ఉంది. హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా ఎంపికైయ్యాడు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనుంది. టీమిండియా తన మొదటి మ్యాచ్‌ని ఐర్లాండ్‌తో జూన్ 5న ఆడనుంది.
Also Read: Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter