రోహిత్ శర్మ ( Rohit Sharma ) అంటేనే హిట్ మ్యాన్ అనే పేరున్న సంగతి తెలిసిందే. స్టేడియం నలువైపులా రోహిత్ శర్మ కొట్టే సిక్సులు చూసి ఎంజాయ్ చేసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. మరో 10 రోజుల్లో IPL 2020 ప్రారంభం కానున్న నేపథ్యంలో అబుధాబిలో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో ప్రాక్టిసింగ్ చేస్తున్న రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్స్ అక్కడికి 95 మీటర్ల దూరంలో వెళ్తున్న ఓ బస్సుని తగిలింది. అది చూసిన తోటి ముంబై ఇండియన్స్ జట్టు ( Mumbai Indians ) ఆటగాళ్లు.. రోహిత్ భాయ్ సిక్సరా మజాకా అని ఎంజాయ్ చేశారు. Also read : 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ముంబై ఇండియన్స్ జట్టు కెప్టేన్ రోహిత్ శర్మ కొట్టిన ఈ భారీ షాట్‌కి సంబంధించిన వీడియోను ఆ జట్టు ఫ్రాంచైజీ ట్విటర్ ద్వారా క్రికెట్ ప్రియులతో షేర్ చేసుకుంది. ఐపిఎల్ ఆరంభించకముందే ప్రాక్టీసింగ్‌లోనే రోహిత్ శర్మ రెచ్చిపోవడం చూసి ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులు సైతం ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అని రోహిత్‌ని అభినందనల్లో ముంచెత్తుతున్నారు. Also read :