Rohit Sharma post emotional note after Mumbai Indians lost 8th straight match: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తేలిపోతున్న రోహిత్ సేన.. వరుసగా ఎనిమిది ఓటములు చవిచూసి ప్లేఆఫ్స్‌ బరి నుంచి తప్పుకుంది. ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంబై చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. వరుస ఓటములతో ముంబై విమర్శల వర్షం కురుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సొంత స్టేడియం వాంఖడే మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. వరుసగా ఏడు ఓటములు, సొంత మైదానం కాబట్టి ముంబై కచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆలా జరగలేదు. లక్నోతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమితమైంది.


ముంబై ఇండియన్స్ వరుస ఓటముల నేపథ్యంలో రోహిత్ శర్మ సోమవారం సోషల్ మీడియా భావోద్వేగ పోస్ట్‌ చేశాడు. 'ఐపీఎల్ 2022లో మా అత్యుత్తమ అడుగు ముందుకు పడలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. చాలా మంది క్రీడా దిగ్గజాలు ఈ దశను దాటారు. ఏదేమైనా నేను ఈ జట్టును ప్రేమిస్తున్నా. ముంబై జట్టుపై ఇప్పటివరకు విశ్వాసం మరియు విధేయతను చూపిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు' అని రోహిత్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. 



'బ్యాటింగ్‌ చేసేందుకు పిచ్‌ బాగుంది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సింది. మేము పూర్తిగా విఫలమయ్యాం. మంచి భాగస్వామ్యాలను  నిర్మించలేకపోయాం. నాతో సహా పలువురు బ్యాటర్లు బాధ్యతారాహిత్యమైన షాట్లు ఆడారు. ఐపీఎల్ 2022లో మేం సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాం. ఇతర జట్ల ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. నాకు జట్టులో పెద్దగా మార్పులు చేయడం ఇష్టముండదు. తుది జట్టులో ఎవరికి అవకాశం ఇచ్చినా బాగా ఆడాలనే అనుకుంటాం' అని లక్నో మ్యాచ్ అనంతరం రోహిత్ చెప్పాడు. 


Also Read: Good Luck Gifts: ఈ బహుమతులను ఇచ్చినా.. తీసుకున్నా అదృష్టమే! అవేంటో తెలుసా?


Also Read: నేను లైంగిక వేధింపులకు గురయ్యా.. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా షాకింగ్ కామెంట్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.