Jasprit Bumrah named as Indian Captain: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదవ టెస్ట్‌ (రీ షెడ్యూల్డ్‌) మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఎవరనే అంశంపై సందిగ్ధత వీడింది. కరోనా మహమ్మారి బారిన పడిన రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో.. అతడి స్థానంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. వైస్‌ కెప్టెన్‌గా వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ సేవలు అందించనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదవ టెస్ట్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు' అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో ఎంపిక చేసిన ఆటగాడి పేరు మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. రోహిత్ స్థానంలో తెలుగు ప్లేయర్స్ హనుమ విహారి లేదా కేఎస్ భరత్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. గిల్ మరో ఓపెనర్ స్థానంలో బరిలోకి దిగనున్నాడు.


ఇంగ్లండ్ వెళ్లిన అనంతరం కరోనా వైరస్ బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ ఇంకా కోలుకోలేదు. ఈ రోజు (జూన్ 30) ఉదయం చేసిన రాపిడ్‌ టెస్ట్‌లోనూ అతడికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో రోహిత్ మరికొన్ని రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. వరుసగా రెండు ర్యాపిడ్‌ టెస్టుల్లో నెగిటివ్‌ వస్తేనే రోహిత్‌ జట్టు ఆటగాళ్లతో కలవనున్నాడు. 


గతేడాది ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో భారత్ పర్యటించగా.. చివరి మ్యాచ్ కరోనా మహమ్మారి కారంగా వాయిదా పడింది. దాంతో ఇరు జట్ల పరస్పర అంగీకారంతో.. చివరి మ్యాచ్‌‌ను ఇప్పుడు రీ షెడ్యూల్ చేశారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్‌లో భారత్ గెలిచినా లేదా కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ సొంతమవుతోంది. భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే చరిత్ర సృష్టించి.. ఇంగ్లీష్ గడ్డపై తొలిసారి భారత్ టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోనుంది. 


Also Read: నాటువైద్యం తీసుకుంటున్న ఎంఎస్ ధోనీ.. ఎంత చెల్లిస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!


Also Read: Sonali Bindre Rumours: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఆ అవసరం నాకు లేదు: సోనాలి బింద్రె  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.