RCB becomes second sports team globally for the Highest social media engagement in April 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చరిత్ర సృష్టించింది. సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా టాప్ త్రీ స్పోర్ట్స్ జట్లలో ఆర్‌సీబీ ఒకటిగా నిలిచింది. డిపోర్టెస్ మరియు ఫినాంజాస్ నివేదిక ప్రకారం.. బెంగుళూరు ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాలో రెండవ అత్యధిక ఎంగేజ్‌మెంట్‌ను సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఆర్‌సీబీ కంటే ముందు ఫుట్‌బాల్ జట్టు రియల్ మాడ్రిడ్ ఉంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 2022 నెలలో రియల్ మాడ్రిడ్ టీమ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా జట్లలో అత్యధిక సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌ను కలిగి ఉన్న జట్టుగా నిలిచింది. రియల్ మాడ్రిడ్ జట్టుకు 321 మిలియన్ ఎంగేజ్‌మెంట్‌ వచ్చింది. రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 190 మిలియన్ ఎంగేజ్‌మెంట్‌ ఉంది. దాంతో క్రికెట్ ఆట చరిత్రలో బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ క్రికెట్ జట్టుకు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ బెంగళూరుకు ఉందని మరోసారి నిరూపించుకుంది. ఇక మూడో స్థానాల్లో ఉన్న ఫుట్‌బాల్ జట్టు ఎఫ్‌సీ బార్సిలోనాకు 179 మిలియన్ ఎంగేజ్‌మెంట్‌ వచ్చింది. 


డిపోర్టెస్ మరియు ఫినాంజాస్ నివేదిక ప్రకారం.. సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌ను ఫాలోయర్స్, లైక్స్, కామెంట్స్, రీ ట్వీట్స్ లాంటివి పరిగణలోకి తీసుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌లను లెక్కలోకి తీసుకుంటారట. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అద్భుతమైన సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది. దానికి తోడు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించడం కూడా బాగా హెల్ప్ అయింది. 



విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్ మరియు ఫాఫ్ డుప్లెసిస్ వంటి స్టార్ ఆటగాళ్లు బెంగళూరుకు ఆడుతున్న విషయం తెలిసిందే. వీరి ఫాన్స్ కూడా సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌కు దోహదపడింది. మరోవైపు విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ కూడా ఏప్రిల్ నెలలో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌లలో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2022 లీగ్ దశలో బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో బుధవారం (మే 25) లక్నోతో ఎలిమినేటర్ పోరులో తలపడనుంది. 


Also Read: AB de Villiers IPL: ఆర్‌సీబీ అభిమానులకు శుభవార్త.. ఏబీ డివిలియర్స్ వచ్చేస్తున్నాడు! అసలు ట్విస్ట్ ఏంటంటే


Also Read: SVP Collections: బాక్సాఫీస్‌పై 'సర్కారు వారి పాట' దండయాత్ర.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook