AB de Villiers IPL: ఆర్‌సీబీ అభిమానులకు శుభవార్త.. ఏబీ డివిలియర్స్ వచ్చేస్తున్నాడు! అసలు ట్విస్ట్ ఏంటంటే

AB de Villiers set to return for RCB in IPL 2023. బెంగళూరుకి సుదీర్ఘకాలం ఆడిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ 2023 ఆడుతానని స్పష్టం చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 03:27 PM IST
  • ఆర్‌సీబీ అభిమానులకు శుభవార్త
  • ఏబీ డివిలియర్స్ వచ్చేస్తున్నాడు
  • అసలు ట్విస్ట్ ఏంటంటే
AB de Villiers IPL: ఆర్‌సీబీ అభిమానులకు శుభవార్త.. ఏబీ డివిలియర్స్ వచ్చేస్తున్నాడు! అసలు ట్విస్ట్ ఏంటంటే

Ab de Villiers Set to Return for Royal Challengers Bangalore in IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌కి చేరిన విషయం తెలిసిందే. బుధవారం (మే 25) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 7.30 గంటలకి ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టును ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌ ముందర ఆర్‌సీబీకి ఓ శుభవార్త వచ్చింది. బెంగళూరుకి సుదీర్ఘకాలం ఆడిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ 2023 ఆడుతానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని డివిలియర్స్ స్వయంగా చెప్పాడు. ఈ విషయం తెలిసిన ఆర్‌సీబీ అభిమానులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరూ ఊహించని విధంగా 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఏబీ డివిలియర్స్.. 2021 సీజన్ తర్వాత ఐపీఎల్‌కి కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. నిజానికి ఆటపై ఉన్న ఇష్టంతో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూసినా.. దక్షిణాఫ్రికా బోర్డు అందుకు సముఖత వ్యక్తం చేయలేదు. దాంతో అంతర్జాతీయ రీఎంట్రీపై ఏబీ ఆశలు వదులుకున్నాడు. ఇక గతేడాది ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పినా.. రీఎంట్రీ ఇస్తాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల వచ్చే ఏడాది ఐపీఎల్‌కి బెంగళూరు టీమ్‌లో ఏబీ ఉంటాడని ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచాప్రాయంగా చెప్పాడు. డివిలియర్స్‌ను మిస్సవుతున్నా  అని,ఆర్‌సీబీలోకి వచ్చే  సీజన్లో అతను వస్తాడనుకుంటా అంటూ హింట్ ఇచ్చాడు. 

చివరకు విరాట్ కోహ్లీ మాటలు నిజం అయ్యాయి. తాజాగా వీయూ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2023కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. 'ఐపీఎల్‌ టోర్నీలోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా. ఐపీఎల్ 2023కి అందుబాటులో ఉంటా. బెంగళూరు నాకు రెండో ఇల్లు. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు ఆడటం చాలా ఇష్టం' అని మిస్టర్ 360 చెప్పాడు. అయితే ఏబీ ప్లేయర్‌గా వస్తాడా లేదా మెంటార్‌గా వస్తాడా లేదా కోచ్‌గా వస్తాడన్న విషయం తెలియరాలేదు. 

2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. ఆర్‌సీబీ తరఫున 150 మ్యాచ్‌లు ఆడి 4491 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 37 అర్ధ శతకాలు ఉన్నాయి. మొత్తంగా ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లాడిన మిస్టర్ 360.. 5162 రన్స్ చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. తన పవర్ హిట్టింగ్ బ్యాటింగ్‌తో బెంగళూరు జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఎన్నో సూపర్ ఇన్నింగ్స్ ఏబీడీ బ్యాట్ నుంచి వచ్చాయి. 

Also Read: GT vs RR Playing XI: క్వాలిఫయర్-1‌‌లో టాప్ జట్ల మధ్య పోటీ.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే! తుది జట్లు ఇవే!

Also Read: SVP Collections: బాక్సాఫీస్‌పై 'సర్కారు వారి పాట' దండయాత్ర.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x