Parthiv Patel says I was surprised to see RCB retain Glenn Maxwell Rs 11 crores: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఎప్పటిలానే నిరాశ పరిచిన విషయం తెలిసిందే. 'ఈ సాలా కప్ నమ్‌'దే అంటూ రావడం వట్టిచేతులతో వెళ్లిపోవడం ఆర్‌సీబీకి పరిపాటిగా మారిందని మరోసారి నిరూపించింది. అదృష్టం కలిసొచ్చి ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ వరకు వచ్చిన ఆర్‌సీబీ.. కీలక ఎలిమినేటర్ మ్యాచులో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో బెంగళూరు అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలిమినేటర్ మ్యాచులో కీలక ఆటగాళ్లు విఫలమవడంతో ఆర్‌సీబీ ఒట్టిచేతులతో ఇంటిదారి పట్టింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ విఫలమవ్వడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. 157 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ మరో 11 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. జోస్ బట్లర్ (106) శతకం చేశాడు. ఆర్‌సీబీ వైఫల్యంపై స్పందించిన ఆ జట్టు మాజీ ప్లేయర్ పార్దీవ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆర్‌సీబీ అతడిని అనవసరంగా రిటైన్ చేసుకుందన్నాడు. మ్యాక్సీ ఐపీఎల్ లీగ్‌లో ఎప్పుడూ రాణించలేదని, ఐదేళ్లకోసారి బాగా ఆడి కోట్లు జేబులో వేసుకుంటాడని విమర్శించాడు. 


'గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని ఆర్‌సీబీ రిటైన్ చేసుకోవడం చూసి నేను షాకయ్యా. మ్యాక్సీ ఆడింది ఒకే ఒక్క సీజన్. అప్పుడు బాగానే ఆడాడు. ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్‌ పర్ఫామెన్స్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రతీ ఐదు సీజన్ల తర్వాత ఓసారి బాగా రాణిస్తాడు. ఆ ప్రదర్శనతోనే కోట్లు జేబులో వేసుకుంటాడు. మ్యాక్సీ ప్రతీ ఏడాది ఆడతాడని ఆశలు పెట్టుకోవడమే ఆర్‌సీబీ చేసిన పెద్ద పొరపాటు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోవడమే ఆర్‌సీబీని దెబ్బతీసింది' అని పార్థివ్ పటేల్ అన్నాడు.


ఐపీఎల్ 2021 సీజన్‌లో 14 మ్యాచుల్లో 513 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన మ్యాక్సీ 301 పరుగులు మాత్రమే చేశాడు. రూ.7 కోట్లకు రిటైన్ చేసుకున్న మహ్మద్ సిరాజ్.. 15 మ్యాచుల్లో 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మరోవైపు బెంగళూరు వదిలేసిన యజ్వేంద్ర చహాల్.. రాజస్థాన్ రాయల్స్‌ తరఫున 26 వికెట్లు పడగొట్టాడు. 


Also Read: GT vs RR Dream11 Team: ఐపీఎల్ 2022 ఫైనల్ పోరులో గుజరాత్‌, రాజస్తాన్‌ ఢీ.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!  


Also Read: Indonesia boat accident: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 26 మంది గల్లంతు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook