Ruturaj Gaikwad smashes seven sixes in an over  in Vijay Hazare Trophy 2022: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు అయింది. టీమిండియా యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ యువీ రికార్డును బద్దలు కొట్టాడు. ఒకే ఓవర్‌లో వరుసగా 7 సిక్స్‌లు బాదిన రుతురాజ్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఏ స్థాయి క్రికెట్‌లో అయినా ఒకే ఓవర్‌లో వరుసగా 7 సిక్సులు ఎవరూ బాదలేదు. 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదడమే ఇప్పటివరకు ఆల్‌టైమ్ రికార్డు. తాజాగా భారత దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ ఒకే ఓవర్‌లో వరుసగా 7 సిక్స్‌లు (నోబాల్‌తో సహా) కొట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా ఉత్తర్ ప్రదేశ్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ ఒకే ఓవర్‌లో 7 సిక్సులు బాదాడు. యూపీ బౌలర్ శివా సింగ్ వేసిన 49వ ఓవర్‌లో రుతురాజ్వరుసగా నాలుగు సిక్సులు కొట్టాడు. ఐదో బంతి నోబాల్‌ వేయగా.. అది కూడా సిక్స్ వెళ్ళింది. ఆపై రెండు బంతులకు కూడా రుతురాజ్ సిక్సులు బాదాడు. దాంతో ఈ ఓవర్‌లో మొత్తంగా 43 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్‌లో అత్యధిక రన్స్ (43 పరుగులు) చేసిన రికార్డు రుతురాజ్ తన పేరుపై లిఖించుకున్నాడు. మరోవైపు ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును శివా సింగ్ పేరుపై నమోదైంది. 


ఏ స్థాయి క్రికెట్‌లో అయినా ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు ఎవరూ బాదలేదు. ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. ఇక భారత్ తరఫున ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో మాజీ ప్లేయర్ రవిశాస్త్రి ఈ ఫీట్ సాధించగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ ఈ రికార్డు అందుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో స్టువర్డ్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ 6 సిక్సులు బాదిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా ప్లేయర్ హర్షల్ గిబ్స్, వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ కూడా 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదారు.



ఉత్తర్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (220 నాటౌట్; 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేశాడు. రుతురాజ్ తన ఇన్నింగ్స్‌లో 16 సిక్స్‌లు బాదాడు. అంకిత్ బావ్నే(37), అజిమ్ కాజీ(37) రాణించారు. రుతురాజ్ విధ్వంసంతో మహరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 330 పరుగులు చేసి.. ఉత్తరప్రదేశ్ ముందు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 


Also Read: Ramdev Baba: నేను తీవ్రంగా చింతిస్తున్నా అంటూ.. మహిళలకు రాందేవ్ బాబా క్షమాపణలు!


Also Read: WhatsApp Data Leak: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. హ్యాకర్ల చేతిలో 50 కోట్ల మంది డేటా! ఆ కాల్స్‌, మెసేజెస్‌కి స్పందించకండి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.