South Africa Vs Afghanistan Highlights: వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత పోరాటం ముగిసింది. రెండు మ్యాచ్‌లు గెలిస్తే చాలు అనే స్థాయి నుంచి పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక వంటి జట్లకు షాకివ్వడంతోపాటు ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించింది. చివరి వరకు సెమీస్‌లో బెర్త్ కోసం పోరాడింది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం సఫారీ టీమ్ ఐదు వికెట్లు కోల్పోయి.. 47.3 ఓవర్లలోనే  లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికే సెమీస్‌ చేరిన దక్షిణాఫ్రికాకు ఇది టోర్నీలో ఏడో విజయం. 14 పాయింట్లతో రెండోస్థానంలో సెమీస్ ఆడనుంది. ఇక అఫ్గానిస్థాన్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. 8 పాయింట్లతో ఆరోస్థానంలో టోర్నీని ముగించింది. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధించింది. సఫారీ చేతిలో ఓటమి తరువాత అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకుంది.


అఫ్గానిస్థాన్ విధించిన 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దక్షిణాఫ్రికా.. ఓపెనర్లు డికాక్‌ (47 బంతుల్లో 41, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బవుమా (23) శుభారంభం ఇచ్చారు. 11వ చివరి బంతికి బవుమాను ఔట్ చేసి ముజిబ్ ఈ జంటను వీడిదీశాడు. ఆ తరువాత డికాక్‌ను నబీ పెవిలియన్‌కు పంపించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన డస్సెన్‌ (95 బంతుల్లో 76 నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌లో మార్‌క్రమ్‌ (25), క్లాసెన్‌ (10), డేవిడ్‌ మిల్లర్‌ (24) తక్కువ స్కోర్లకే ఔట్ అయిపోయారు. అఫ్గాన్ బౌలర్లు పట్టుసాధించినట్లు కనిపించినా.. అండిల్ (39 నాటౌట్‌)తో కలిసి డస్సెన్ సఫారీని గెలిపించాడు. రషీద్ ఖాన్, నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్‌కు ఒక వికెట్ దక్కింది.  


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్..  50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (107 బంతుల్లో 97, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఓ మోస్తరు స్కోరుకే వెనుదిరుగుతున్నా.. ఒమర్జాయ్ మాత్రం సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. సెంచరీకి మరో మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కోయిట్టీ నాలుగు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, కేశవ్ మహారాజ్ తలో రెండు వికెట్లు, ఫెహ్లూక్వాయో ఒక వికెట్‌ పడగొట్టారు. డస్సెన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సెమీస్‌ పోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. 


Also Read: PF Interest: పీఎఫ్‌ ఖాతాదారులకు దీపావళి బొనంజా.. వడ్డీ వచ్చేసింది.. మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి


Also Read: Diwali Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రిక్ బైకుల విక్రయాలు..దీపావళి సందర్భంగా ఈ బైక్ రూ. 58,999కే పొందవచ్చు!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook