PF Interest: పీఎఫ్‌ ఖాతాదారులకు దీపావళి బొనంజా.. వడ్డీ వచ్చేసింది.. మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

How To Check PF Balance Online: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. వడ్డీ డబ్బులను ఈపీఎఫ్‌ఓ ట్రాన్స్‌ఫర్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో జమ అవ్వగా.. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మీ పీఫ్‌ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 10, 2023, 08:12 PM IST
PF Interest: పీఎఫ్‌ ఖాతాదారులకు దీపావళి బొనంజా.. వడ్డీ వచ్చేసింది.. మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

How To Check PF Balance Online: దీపావళి కంటే ముందే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు శుభవార్త వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వడ్డీ డబ్బును ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లకు బదిలీ చేయడం ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ఓ ​​పెట్టుబడికి వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. ఈ మేరకు వడ్డీ జమ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగుల ఖాతాలకు వడ్డీ డబ్బు జమ అయింది. అయితే అన్ని ఖాతాలకు నగదు బదిలీ చేయడానికి కాస్త టైమ్ పడుతుంది. వడ్డీ డబ్బు మీ అకౌంట్‌లో ఇంకా జమ కాకపోతే.. టెన్షన్‌ పడకండి. 

“మొత్తం వడ్డీ టాన్స్‌ఫర్ ప్రక్రియ కొనగుతోంది. పీఎఫ్‌ లబ్ధిదారుల అకౌంట్‌లో వడ్డీ డబ్బు త్వరలో కనిపిస్తుంది. వడ్డీ జమ త్వరలోనే పూర్తవుతుంది. దయచేసి ఓపిక పట్టండి.” అని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. వడ్డీ జమ ప్రక్రియ గతంలో కంటే సునాయాసంగా జరుగుతోందని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 24 కోట్ల ఖాతాలకు వడ్డీ డబ్బులు బదిలీ అయ్యాయని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇప్పటికే వెల్లడించారు. పీఎఫ్‌ వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి సలహాల తర్వాత ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ప్రతి సంవత్సరం నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో 8.15 శాతంగా ఈపీఎఫ్‌ఓ ​​వడ్డీ రేట్లను ప్రకటించింది. ప్రభుత్వ సెక్యూరిటీల వడ్డీ రేటు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేటును నిర్ణయిస్తారు. 

పీఎఫ్ బ్యాలెన్స్‌ ఇలా చెక్ చేసుకోండి..

==> ముందుగా మీరు epfindia.gov.in లో EPFO ​​అధికారిక పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి 
==> హోమ్‌పేజీపై క్లిక్ చేసి.. 'సర్వీసెస్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 'ఎంప్లాయర్స్ కోసం' అనే లింక్‌పై క్లిక్ చేయండి
==> తర్వాతి పేజీలో 'సేవలు' విభాగంలో 'సభ్యుని పాస్‌బుక్' లింక్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత స్క్రీన్‌పై లాగిన్ పేజీ కనిపిస్తుంది.
==> మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. 
==> మీ అకౌంట్ వివరాలు, క్రెడిట్ చేసిన వడ్డీని చెక్ చేసుకోండి.

UMANG యాప్‌లో ఇలా..

==> ఉమంగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి - https://web.umang.gov.in/landing /
==> ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో పాస్‌బుక్‌ని వీక్షించండి.
==> యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని నమోదు చేయండి.
==> మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
==> మెంబర్ ఐడీని ఎంచుకుని.. ఈ-పాస్‌బుక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
==> ఈ-పాస్‌బుక్ వివరాలు, ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

Also Read: Best Sound Bar: సాంసంగ్‌ సౌండ్‌ బార్‌పై రూ.3000 తక్షణ డిస్కౌంట్‌..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News