South Africa Beat Pakistan By 1 Wicket: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. సఫారీ బౌలర్ల ధాటికి 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. అనంతరం దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యాటింగ్‌లో ఐడెన్ మార్క్రామ్ 91 పరుగులతో రాణించగా.. బౌలింగ్‌లో తబ్రేజ్ షమ్సీ 4 వికెట్లు పడగొట్టాడు. ఈ వరల్డ్‌కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి జోష్‌లో కనిపించిన పాకిస్థాన్.. టీమిండియా చేతిలో ఓటమి తరువాత పూర్తిగా డీలా పడిపోయింది. ఆసీస్‌తో ఓటమి.. చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్ చేతిలో పరాజయం.. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. 
 
పాక్ విధించిన 271 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభం బాగానే ఉన్నా.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్ (24) తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. కెప్టెన్ బవుమా (28) కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఐడెన్ మార్క్‌క్రమ్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అయితే 21 పరుగులు చేసి వాన్ డెర్ డ్యూసెన్‌ ఔట్ అవ్వడంతో పాక్ మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం డేవిడ్ మిల్లర్‌తో కలిసి మార్క్‌క్రమ్ ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. డేవిడ్ మిల్లర్ (29), మార్కో జాన్సెన్ (20), మార్క్‌క్రమ్ (91) ఔట్ కావడంతో పాక్ రేసులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సఫారీ విజయానికి మరో 11 పరుగులు అవసరం కాగా.. ఒక వికెట్ తీస్తే పాక్ జట్టు గెలిచేది. దీంతో స్టేడియంలో, టీవీల ముందు అభిమానుల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది. అయితే చివర్లో కేశవ్ మహరాజ్, షమ్సీ పాకిస్థాన్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. మహరాజ్ 7 పరుగులతో, షమ్సీ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. జట్టును గెలిపించారు. పాక్ బౌలర్లలో షహీన్ షా ఆఫ్రిది 3 వికెట్లు తీయగా.. హరీస్ రవూఫ్, ఉసామా మీర్, వసీం జూనియర్ తలో 2 వికెట్లు పడగొట్టారు.


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. 46.4 ఓవర్లలో 270 పరుగులకే పరిమితమైంది. సౌద్ షకీల్, కెప్టెన్ బాబర్ అజామ్అర్ధ సెంచరీలు రాణించారు. షకీల్ 52 పరుగులు చేయగా, కెప్టెన్ బాబర్ 50 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా తరఫున తబ్రేజ్ షమ్సీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ 3, కోయెట్జీకి 2, లుంగీ ఎంగిడి ఒక వికెట్ పడగొట్టారు. షమ్సీకే మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook