'జెర్సీ నెంబర్ 10' క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చొక్కా పై ఉండే నెంబర్. తాజాగా ఈ నెంబర్ కు వీడ్కోలు పలకాలని బీసీసీఐ అనధికారికంగా నిర్ణయించింది. ఈ నెంబర్ అంటే క్రికెట్ అభిమానులకు క్రేజ్.. కాదు... కాదు పిచ్చి. ఎంతలా అంటే కొన్ని సంవత్సరాల క్రితం సచిన్ ధరించే ఆ 10 వ నెంబర్ ను తమ చొక్కాలపై కూడా ఉండాలని యువత అనుకొనేవారట. డ్రెస్స్ లను కూడా అలానే కుట్టించేవారు.. వాటినే కొనేవారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా బీసీసీఐ సచిన్ గౌరవ సూచికంగా నెంబర్ 10 ను ఎవరికీ కేటాయించమని చెప్పిందట. అనవసర వివాదాల జోలికి పొకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. శార్ధూల్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాక ఆయనకు ఈ జెర్సీ నెంబర్ కేటాయించిన సంగతి తెలిసిందే..!


"భారత్-ఏ, అండర్ -19, దేశీయంగా జరిగే అన్ని మ్యాచుల్లో ఈ జెర్సీ నెంబర్ ధరించవచ్చు. అయితే అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రం కుదరదు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒక మీడియాకు వెల్లడించారు. వన్డే మ్యాచుల్లో వర్ధమాన ఆటగాడు శార్ధూల్ ఠాకూర్ 10వ నెంబర్ జెర్సీ ధరించడం.. అది వివాదాస్పదం కావడం.. బీసీసీఐని, అతన్ని చాలా మంది సోషల్ మీడియాలో, బాహాటంగానే విమర్శలు చేయడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుందో.. ఏమో.. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.