వరల్డ్ కప్ లో ధోనీ ఫర్మామెన్స్ తర్వాత  రిటైర్మెంట్ పై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో మాదిరిగా ధోనీ ఆటలేకపోతున్నాడని.. రిటైర్ అవడమే మంచిదని వాదన తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనదైన శైలిలో స్పందించాడు. ధోనీ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని విమర్శలకులకు కౌంటర్ ఇచ్చారు. 
ధోనికి ప్రత్యేక స్థానం ఉంది
సచిన్ మాట్లాడుతూ దేశ క్రికెట్ చరిత్రలో ధోనీది ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నాడు.  భారత్ కు అతను ఎన్నో విజయాలు అందించాడని.. కపిల్ తర్వాత దేశానికి వరల్డ్ కప్ అందించిన ఘనత ధోనీకే దక్కుతుందన్నాడు. దేశ క్రికెట్ చరిత్రలో ధోనీది ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని.. అతన్ని అందరూ గౌరవించాలని సచిన్ అభిప్రాయపడ్డారు. 


మారిన సచిన్ రియాక్షన్
లీగ్ దశలో ఆప్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ స్లో ఆటతీరుపై అసహనం వ్యక్తం చేసిన సచిన్..న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్లో ధోనీ స్లోగా ఆడినప్పటికీ ఎలాంటి విమర్శ చేయలేదు.పైగా ధోనీని ఆటతీరును ప్రసంశించాడు. కివీస్ తో జరిగిన సెమీఫైనల్లో ధోనీ క్రీజులో ఉన్నంత వరకు ఇండియా ఓడిపోలేదని... మ్యాచ్ ను అతడు గెలిపిస్తాడనే నమ్మకం అందరిలో ఉందన్నాడు. ఆ నమ్మకం ఉన్నంత వరకు ధోనీ క్రికెట్ ఆడవచ్చన్న సచిన్ ... ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు అని పేర్కొన్నాడు.