Australia Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన సానియా జోడీ.. మా మధ్య మంచి బంధం ఉందంటూ!
Sania Mirza, Rohan Bopanna pair reaches Australian Open 2023 mixed doubles final. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బొపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా.. ఫైనల్‌కు చేరుకున్నారు.
Sania Mirza, Rohan Bopanna Enters Australian Open 2023 Mixed Doubles Final: కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అద్భుత ఆటతో దూసుకుపోతున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ రోహన్ బొపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా.. ఏకంగా ఫైనల్‌కు చేరుకున్నారు. మెల్‌బోర్న్‌లో నేడు జరిగిన సెమీస్‌లో మూడో సీడ్ ప్లేయర్స్ డిసిరే క్రావ్జిక్ (యూఎస్‌ఏ)-నీల్ స్కుప్స్కి (గ్రేట్ బ్రిటన్) జోడీపై 7-6 (5), 6-7 (5), 10-6 తేడాతో సానియా-బొపన్న ద్వయం విజయం సాధించారు.
దాదాపు గంట 52 నిమిషాలు పాటు మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్ మ్యాచ్ డిసిరే క్రావ్జిక్-నీల్ స్కుప్స్కి, సానియా మీర్జా-రోహన్ బొపన్న జోడిల మధ్య హోరాహోరీగా సాగింది. ముందుగా చెరొక రౌండ్ విజయం సాధించారు. ఇక కీలకమైన మూడో రౌండ్‌లో సానియా విజృంభించారు. ముఖ్యంగా బ్యాక్ హ్యాండ్ షాట్లతో అలరించారు. చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా.. బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోనూ విజయం సాధించి ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సానియా మీర్జా, రోహన్ బోపన్న ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే.. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. భారత జోడీతో తలపడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)-వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో భారత జంటకు వాకోవర్ లభించింది.
మ్యాచ్ అనంతరం సానియా మీర్జా మాట్లాడుతూ... 'అద్భుతమైన మ్యాచ్. నా చివరి గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరులో రోహన్ బోపన్నతో కలిసి ఆడటం చాలా బాగుంది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పటినుంచి నా మిక్స్‌డ్ డబుల్ పార్టనర్ రోహన్. ఇప్పుడు నా వయస్సు 36 కాగా.. అతడికి 42 ఏళ్లు. అయినా మేం ఇప్పటికీ బాగా ఆడుతున్నాం. ఆటగాళ్లుగా మా మధ్య మంచి బంధం ఉంది. మమ్మల్ని మేం నిరూపించుకొనేందుకు ఇది మంచి అవకాశం. భారత్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన చాలామంది నాకు మద్దతుగా నిలిచారు. అందరికీ ధన్యవాదాలు' అని అన్నారు.
Also Read: Republic Day 2023: దొరగారి బహిరంగ సభలకు అడ్డురాని కరోనా.. గణతంత్ర వేడుకలకు అడ్డొచిందట: వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook