Sanju Samson: సంజూ శాంసన్ మంచి మనసు.. రెండో వన్డే మ్యాచ్ ఆడకున్నా సాయం! వీడియో వైరల్
Sanju Samson spotted at Hamilton ground during IND vs NZ 2nd ODI. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్‌లో భాగం కాకపోయినా.. సంజూ శాంసన్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
Sanju Samson helps Hamilton ground staff in Adjusting Covers during IND vs NZ 2nd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య హామిల్టన్ వేదికగా ఆదివారం రెండో మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ల వద్ద తొలుత వర్షం అంతరాయం కలిగించింది. దాదాపుగా 3 గంటల అనంతరం వర్షం తగ్గు ముఖం పట్టడంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. భారత ఇన్నింగ్స్ 12.5 వద్ద ఉన్నపుడు భారీ వర్షం కురిసింది. మ్యాచ్ సాగడానికి వీల్లేకుండా పోవడంతో.. ఆఖరికి అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తొలి వన్డేలో 36 పరుగులు చేసిన టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు రెండో మ్యాచ్ ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. ఆరో బౌలర్ ఆప్షన్ కోసం శాంసన్ బదులు ఆల్‌రౌండర్ దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకొన్నాం అని కెప్టెన్ శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు. అయితే సంజూ మ్యాచ్‌లో భాగం కాకపోయినా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. తొలుత వర్షం తగ్గుముఖం పట్టాక గ్రౌండ్ స్టాప్ మైదానం సిద్దం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో గ్రౌండ్ స్టాఫ్ కవర్లను పట్టుకునేందుకు కష్టపడుతుండగా.. శాంసన్ సిబ్బందికి సహాయం చేశాడు.
సంజూ శాంసన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. అంతర్జాతీయ క్రికెటర్ అయినప్పటికీ.. గ్రౌండ్ స్టాప్‌కు చేసిన సాయంపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. 'మ్యాచ్ ఆడకపోయినా సంజూ శాంసన్ హీరోనే' అని ఒకరు కామెంట్ చేయగా.. 'సంజూ శాంసన్ మంచి మనసు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజూ ఆడుతున్నాడు. ఈ జట్టుకు అతనే కెప్టెన్ కూడా. ఐపీఎల్ 2022లో ఫైనల్లో ఆర్ఆర్ ఓడిపోయింది.
Also Read: Sanju Samson: ఆ ఒక్క కారణంగానే.. సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు: శిఖర్ ధావన్
Also Read: Saturday Remedies: శనివారం నాడు ఈ వస్తువులను ఉచితంగా కూడా తీసుకోకండి.. తీసుకున్నారో అంతే సంగతులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.