Sarfaraz Khan Brother: అన్నకు పోటీగా తమ్ముడు.. ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్
Sarfaraz Khan Brother Musheer Khan: సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు తోడు అతని తమ్ముడు కూడా ట్రిపుల్ సెంచరీతో వెలుగులోకి వచ్చాడు. అన్న కంటే తానేం తక్కువ కాదని నిరూపించుకున్నాడు. హైదరాబాద్‌పై 367 బంతుల్లో 339 పరుగులు చేసి.. ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు.
Sarfaraz Khan Brother Musheer Khan: దేశవాళీ క్రికెట్‌లో ముంబై యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ సంచలనం సృష్టిస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నా.. సెలెక్టర్లు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేయగా.. సర్ఫరాజ్‌కు నిరాశ ఎదురైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు కూడా ట్రిపుల్ సెంచరీతో వెలుగులోకి వచ్చాడు.
సర్ఫరాజ్ ఖాన్ ముషీర్ ఖాన్ కూడా క్రికెట్ ఆడుతున్నాడు. సీకే నాయుడు ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ బాది తెరపైకి వచ్చాడు. ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్.. హైదరాబాద్ జట్టుపై 339 పరుగులతో చెలరేగి ఆడాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ముంబై 8 వికెట్ల నష్టానికి 704 (డిక్లేర్డ్) పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ 367 బంతుల్లో 339 పరుగులు చేశాడు. ఇందులో 34 ఫోర్లు, 9 సిక్సర్లు వచ్చాయి. ముషీర్ ఖాన్‌తో పాటు ముంబై ఆటగాడు వినోద్ కూడా డబుల్ సెంచరీ (214) సాధించాడు.
ముంబై తరఫున ముషీర్ ఖాన్ నిలకడగా రాణిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో కూడా అతను టీమిండియాకు ప్రాతినిధ్య వహించాడు. రంజీ చివరి సీజన్‌లో ముషీర్‌ను ముంబై జట్టులోకి తీసుకున్నారు. ముంబై నుంచి అరంగేట్రం చేసే అవకాశం వచ్చినప్పుడు తన ఆనందాన్ని చెప్పడానికి మాటలు లేవని అన్నాడు ముషీర్. ఈ యంగ్ ప్లేయర్ చాలా కాలంగా ముంబై తరఫున స్థానిక క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఎ విభాగంలో గతేడాది నవంబర్‌లో జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 133 బంతుల్లో 172 పరుగులు చేశాడు. ముషీర్ ఆటతీరుతో ముంబై తరపున రంజీల్లో ఆడే అవకాశం వచ్చింది.
మరోవైపు గత మూడు సీజన్‌లుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇటీవల 52 ఇన్నింగ్స్‌ల్లో 3380 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇందులో ఒక ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. సర్ఫరాజ్ బ్యాటింగ్ సగటు 80.47గా ఉంది. ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ 2019-20లో 155 సగటుతో 928 పరుగులు చేశాడు. 2021-22 సీజన్‌లో మరోసారి 123 సగటుతో 900 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2022-23 సీజన్‌లో కూడా అదే ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన గణాంకాలు ఉన్నా.. సర్ఫరాజ్‌కు టీమిండియాలో చోటు కల్పించకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Also Read: CM Jagan: ఏపీలో రోడ్లకు సరికొత్త రూపురేఖలు.. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
Also Read: Telangana Crime: బాసరలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి