ఇంగ్లండ్‌పై టీమిండియా వరుస ఓటములపై పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు. ఇంగ్లండ్‌లో పర్యటించే ఆసియా జట్టు ఏదైనా అక్కడ కఠిన పరిస్థితులను ఎదుర్కొని కష్టాలు పడుతుందని సర్ఫరాజ్ అన్నాడు. ఇందుకు టీమిండియా ఏమి మినహాయింపు కాదన్నారు. అయితే 2016, ఈ ఏడాదిలో తాము అక్కడ ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచులు ఆడామని.. అందుకే తాము ఇంగ్లండ్‌పై రాణించగలిగామని అన్నాడు. ముందుగా టీ20, వన్డేలు ఆడటం కూడా టీమిండియాకు చేటుచేసిందని అభిప్రాయపడ్డాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌ను తేలిగ్గా తీసుకోం: బెయిర్ స్టో



రెండు టెస్టుల్లో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువగా అంచనా వేయలేమని ఇంగ్లాండ్ క్రికెటర్  బెయిర్ స్టో వ్యాఖ్యానించాడు. పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియదని, భారత్‌ ఎప్పుడైనా పుంజుకునే అవకాశాలను కొట్టిపారేయలేమన్నాడు. రెండో టెస్టులో బెయిర్‌స్టో 93 పరుగులతో రాణించడమే కాకుండా, ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టెస్టులో వరుసగా 70, 28 పరుగులు చేసిన బెయిర్‌స్టో రెండో టెస్టులో 93 పరుగులు చేశాడు. 'ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ వైట్ వాష్ చేస్తుందని వస్తున్న వార్తలపై నేను స్పదించను. ఎందుకంటే సౌత్‌హాంప్టన్‌, ఓవల్ పీచులు వేరుగా ఉంటాయి. మేము టీమిండియాపై ఒత్తిడి తగ్గకుండా వ్యూహంగా పెట్టుకున్నాం' అని పేర్కొన్నాడు. అటు ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈనెల 18న భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో జరగనుంది.