సుప్రీంకోర్టులో క్రికెటర్  శ్రీశాంత్ కు తాక్కలిక ఊరట లభించింది. శ్రీశాంత్పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధం విషయంలో పునరాలోచించాలని సూచించింది. శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా శ్రీశాంత్ తరఫున న్యాయవాది ఖుర్షీద్ వాదిస్తూ శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సరైన ఆధారాలు లేవని ... ప్రాథమిక సమాచారం ఆధారంగా జీవితకాల నిషేధం ఎలా విధిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈ మేరకు బీసీసీఐ సూచన చేసింది


స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013లో క్రికెటర్ శ్రీశాంత్‌ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  2015లో ఢిల్లీ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అయినా.. బీసీసీఐ నిషేధాన్ని తొలగించలేదు. దీంతో శ్రీశాంత్ తన సొంత రాష్ట్రానికి చెందిన కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. నిషేధం ఎత్తివేయాలని.. 2017 ఆగస్టు 7న బీసీసీఐని కేరళ కోర్టు ఆదేశించింది. తీర్పును సవాల్ చేస్తూ బీసీసీఐ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించడం.. నిషేధం కొనసాగించాలని కోర్టు తీర్పును సవరించింది. దీంతో శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. శ్రీశాంత్ పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ మేరకు బీసీసీఐ సూచన చేసింది