IND vs SA: రేపు(ఆదివారం) భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. గౌహతి వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈమ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని టీమిండియా యోచిస్తోంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత జట్టు ఆకట్టుకుంటోంది. తొలి మ్యాచ్‌లో సఫారీ జట్టును తక్కువ స్కోర్‌కు పరిమితం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించింది. టీమిండియా టాప్‌ ఆర్డర్ అంతా మంచి ఫామ్‌లో ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి టచ్‌లో ఉన్నారు. ఇటీవల ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్ నుంచి ఫామ్‌లో ఉన్నారు. ఇటు టీమిండియా రన్‌ మిషన్‌ విరాట్ కోహ్లీ సైతం మంచి రిథమ్‌లో ఉన్నాడు. వరుసగా హాఫ్‌ సెంచరీలు చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే ఔట్ అయినా.. గౌహతి మ్యాచ్‌లో అలరిస్తాడని పండితులు చెబుతున్నారు.


గతకొంతకాలంగా భారత బౌలింగ్ విభాగంపై ఆందోళన కొనసాగుతోంది. ఐతే సౌతాఫ్రికా తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగాయి. 9 పరుగులకే ఐదు కీలక వికెట్లను కూల్చారు. ఆర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్ పోటీ పడి మరి వికెట్లు తీశారు. స్పినర్లు అశ్విన్, అక్షర్‌కుమార్‌ ఆకట్టుకున్నారు. ఈక్రమంలో టీమిండియా సిరీస్‌ కైవసం చేసుకోవడం పెద్దకష్టమేమి కాదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


ఇటు దక్షిణాఫ్రికా సైతం పుంజుకోవాలని యోచిస్తోంది. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. ఈక్రమంలోనే బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీనియర్ ఆటగాళ్లు రాణిస్తే తమ జట్టుకు విజయం తధ్యమని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. డికాక్, మిల్లర్, మార్‌క్రమ్‌పై టీమ్ ఆశలు పెట్టకుంది. బౌలింగ్ విభాగంలో సఫారీ జట్టు స్ట్రాంగ్‌గా ఉంది. తొలి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లకు బౌలర్లు సవాల్ విసిరారు. 


దీంతో టీమిండియా తొలి ఆరు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేవలం 17 పరుగులు మాత్రమే చేసింది. రెండో మ్యాచ్‌లోనూ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బతీయాలని బవుమా సేన స్కెచ్‌లు వేస్తోంది. మొత్తంగా గౌహతి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.


భారత జట్టు(అంచనా)..


రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్‌ కార్తీక్, అక్షర్‌ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్, దీపక్ చాహర్, ఆర్ష్‌దీప్‌ సింగ్


దక్షిణాఫ్రికా జట్టు(అంచనా)..


డికాక్(కీపర్), బవుమా(కెప్టెన్), రోసోవ్, మార్‌కర్మ్, డేవిడ్ మిల్లర్, స్టాబ్స్, పర్నెల్, రబడ, కేశవ్ మహారాజ్, నోర్ట్‌జ్, షంసీ


Also read:IND vs SA: టీ20 వరల్డ్‌ కప్‌లో బుమ్రా ఆడనున్నాడా..? బీసీసీఐ చీఫ్ క్లారిటీ..!  


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి