సెరెనా.. పెళ్ళి కూతురాయెనే..!
సెరెనా వివాహం న్యూఆర్లీన్స్‌లోని కాన్‌టెంపరరీ ఆర్ట్స్ సెంటర్ వేదికగా జరగనుంది.
అమెరికా టాప్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పెళ్లి కూతురుగా మారనుంది. ఏడుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన సెరెనా, తన చిరకాల ప్రియుడు మరియు రెడిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌ను వివాహం చేసుకోనుంది. అయితే ఈ పెళ్ళికి చాలా తక్కువ మంది అతిథులనే ఆహ్వానించనున్నట్లు ఆమె తెలిపింది. వధువరులకు సంబంధించిన స్నేహితులు, బాగా దగ్గర బంధువులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు. 2015 సంవత్సరం నుండీ సెరెనా, అలెక్సిన్ జంట సహజీవనం చేస్తున్నారు. వీరికి ఒక బిడ్డ కూడా. ఈ వివాహానికి దాదాపు 1 మిలియన్ డాలర్లు ఖర్చుపెడుతున్నట్లు వధువరులు వెల్లడించారు. న్యూఆర్లీన్స్‌లోని కాన్‌టెంపరరీ ఆర్ట్స్ సెంటర్ వేదికగా జరగబోయే వీరి వివాహానికి వచ్చే అతిథులను దయచేసి సెల్ ఫోన్లు తీసుకురావద్దని కోరారు సెరెనా. ఈ పెళ్ళి వేడుకను కవర్ చేసే పూర్తి హక్కులను సెరెనా ప్రాణ స్నేహితురాలు మరియు ప్రముఖ బ్రిటీష్ పాత్రికేయురాలు అన్నా వింటూర్ భారీ మొత్తం అందజేసి దక్కించుకున్నారు.