ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడుతున్న మహమ్మద్ షమీ అంతగా రాణించకపోవడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. షమీ బౌలింగ్ పై దృష్టి పెట్టలేకపోతున్నాడనే విషయాన్ని అతని బౌలింగ్ గణాంకాలే చెబుతున్నాయి. ఐపీఎల్ 18 సీజన్‌లో అతను ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో పాటు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు.  1/53.. 1/36.. 1/29.. 0/26 ఇవి గత నాలుగు మ్యాచుల్లో షమీ గణాంకాలు.  దీంతో అతన్ని తీసుకున్న ఫ్రాంచైజీలు డైలమాలో పడ్డాయి. షబీ ఇలాగే ఆడితే ఐపీఎల్ నుంచి తొలగించే అవకాశముందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇదిలా ఉండగా క్లిష్ట స్థితిలో ఉన్న షమీకి డేర్ డెవిల్స్ కోచ్ మద్దతుగా నిలిచాడు. ఈ సందర్భంగా జేమ్స్‌ స్పందిస్తూ షమీ నైపుణ్యం గల ఆటగాడని..ఎలాంటి ఒత్తిడిలోనైనా స్థిరంగా బౌలింగ్ చేయగల సమర్ధుడని కితాబిచ్చాడు. వ్యక్తిగత కారణాల వల్ల షమీ ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నాడని వెల్లడించాడు. క్రికెట్ ఆడుతూ ఉపశమనం పొందాలని షమీ ప్రయత్నిస్తున్నాడు... అతను తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుందని వెల్లడించాడు. సమస్యల్లో ఉన్నప్పుడు చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టడం ఎవరికైనా కష్టతరమేనని.. వాటి నుంచి బయటపడడానికి ఆటగాళ్లు క్రికెట్‌ ఆడుతూ మనసు మళ్లించి కాస్త ఉపశమనం పొందాలని ..షమీ అదే చేస్తున్నాడని జేమ్స్‌ తెలిపారు