Shardul Thakur, Mittali Parulkar's engagement pics: టీమిండియా ఆల్ రౌండర్ శార్థుల్ ఠాకూర్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. తన గాళ్ ఫ్రెండ్ మిట్టలి పరుల్కర్‌తో శార్థుల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అతి కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ముంబైలో నిన్న సోమవారం ఈ ఎంగేజ్‌మెంట్ సెరెమనీ జరిగింది. టీమిండియా టీ20 జట్టు కెప్టేన్ రోహిత్ శర్మ ఈ నిశ్చితార్థం వేడుకకు హాజరయ్యాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధీనంలో ఉన్న ఓ ప్రత్యేక స్థలం శార్థుల్ ఠాకూర్, పరుల్కర్ ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్స్‌కి వేదికైంది. డొమెస్టిక్ క్రికెట్‌లో శార్థుల్ ఠాకూర్ ముంబై నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల చనిపోవడానికి కారణాలివే


టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ (Wasim Jaffer) సైతం తనదైన స్టైల్లో శార్థుల్ ఠాకూర్‌ని విష్ చేశాడు. అదేంటో మీరే చూడండి. 



Also read : Sirivennela Seetharama Sastry: అక్షరాలతో సిరివెన్నెల చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో నిలిచిపోతాయి: జగన్


శార్థుల్ ఠాకూర్ కెరీర్లో ఇప్పటివరకు ఇండియా తరపున 4 టెస్టు మ్యాచులు, 15 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచులు, 22 టీ20 మ్యాచులు ఆడాడు. 2018లో శార్థుల్ ఠాకూర్ టెస్ట్ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేశాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోనూ శార్థుల్ ఠాకూర్ (Shardul Thakur) పాల్గొన్నాడు. కాకపోతే ఈ టీ20 ప్రపంచ కప్‌లో శార్థుల్‌కి రెండు మ్యాచుల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది.


Also read : Samantha Item Song Pushpa: ‘పుష్ప’ ఐటెం సాంగ్ లో సమంత ఫిక్స్.. త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook