ఎమిరేట్స్ సిబ్బందిపై శిఖర్ ధావన్ ఫైర్
టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు.
టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. కేప్ టౌన్‌లో కొత్తగా పెళ్లైన కోహ్లీ దంపతులను కలిసిన మీదట, ధావన్ ఫ్యామిలీ దుబాయ్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్‌లో దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉంది. అయితే ధావన్ సతీమణి మరియు పిల్లల బర్త్ సర్టిఫికెట్లు లేకుండా ఫ్లైట్‌లోకి అనుమతించడం కుదరదని.. ఎమిరేట్స్ అధికారులు చెప్పిన మీదట వారు దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
సర్టిఫికెట్లు చేరేవరకు వారు ధావన్ లేకుండానే ఎయిర్ పోర్టులో ఉండాలని నిర్ణయించుకోవడంతో.. తన కుటుంబం లేకుండానే ధావన్ సౌత్ ఆఫ్రికా టూర్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంపై ధావన్ ట్విటర్‌లో స్పందించారు. ఎమిరేట్స్ అధికారులు చాలా అన్ ప్రొఫెషనల్‌గా ప్రవర్తించారని తెలిపారు. ముంబయిలో ఫ్లైట్ ఎక్కేటప్పుడే సిబ్బంది ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు.