Shoaib Akhtar disappointed about POTM award: టీ20 వరల్డ్​ కప్ 2021 ఆదివారంతో ముగిసింది. ఈ సారి టైటిల్​ విన్నర్​గా ఆస్ట్రేలియా జట్టు (T20 world cup 2021 winner) నిలిచింది. రన్నరప్​గా న్యూజిలాండ్ ఉంది. ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్ కప్​ను ముద్దాడటం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ టోర్నీకి సంబంధించి వివిధ అవార్డులను ప్రకటించగా వాటిలో కొన్నింటిపై కొందరు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


ఇంతకీ ఏమైందంటే...


ఈ సారి వరల్డ్ కప్​లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ (David Warner) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.


శ్రీలంకతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ‌తో టచ్‌లోకి వచ్చిన వార్నర్ తన ఫామ్‌ను ఫైనల్ వరకు కొనసాగించాడు. అద్వితీయమైన బ్యాటింగ్‌తో ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.


మొత్తం 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 284 పరుగులు చేసినందుకు గానూ.. ప్లేయర్​ ఆఫ్​ది టోర్నీగా నిలిచాడు  డేవిడ్​ వార్నర్​. అయితే దీనిపై పాకిస్థాన్​ మాజీ క్రికెటర్ షోయబ్​ అక్తర్ (Shoaib Akhtar) అసంతృప్తి వ్యక్తం చేశాడు.


Also read: Candice Warner Twitter: ‘వార్నర్ ఫామ్ లో లేడా?’.. ఐపీఎల్ ఫ్రాంఛైజీపై వార్నర్ భార్య ఫైర్?


పాక్ కెప్టెన్​, స్టార్​​ బ్యాటర్​ బాబర్​ అజామ్​కు (Pakistan skipper Babar Azam) 'ప్లేయర్ ఆఫ్​ ది టోర్నమెంట్' టైటిల్ దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇది సరైన నిర్ణయం కాదంటూ (వార్నర్​కు ఇవ్వడం) ట్విట్టర్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్త పరిచాడు.



ఈ టోర్నీ మొత్తం మీద బాబర్​ అజామ్​ 6 మ్యాచుల్లో 303 పరుగులు చేయడం గమనార్హం.


Also read: T20 World Cup Prize Money: ఛాంపియన్ ఆస్ట్రేలియాకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే...


Also read: AUS Winning Celebration: 'షూలో బీర్' పోసుకొని తాగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. వీడియో వైరల్


టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సాగిందిలా..


టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.


మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌(85) చెలరేగాడు.


అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్‌ మార్ష్‌(77), డేవిడ్‌ వార్నర్‌(53) అద్భుతంగా బ్యాటింగ్ చేసి తమ జట్టును గెలిపించుకున్నారు. 


Also read: Gavaskar On Vihari: ‘టెస్టు జట్టులో విహారిని ఎంపిక చేయకపోవడానికి కారణమదే’


Also read: Finch On Warner: వార్నర్ ను తక్కువ అంచనా వేశారు: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook