Finch On Warner: వార్నర్ ను తక్కువ అంచనా వేశారు: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్

Finch On Warner: ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 (T20 World cup 2021) విజేతగా ఆస్ట్రేలియా టీమ్ నిలిచింది (AUS vs NZ). ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియన్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ గెలుపు పై ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 07:42 AM IST
    • డేవిడ్ వార్నర్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రశంసలు
    • వార్నర్ ఫామ్ ను తక్కువ అంచనా వేయోద్దని వ్యాఖ్య
    • వార్నర్ తో పెట్టుకోవడమంటే ఎలుగుబంటితో ఆటలాంటిదేనని వెల్లడి
Finch On Warner: వార్నర్ ను తక్కువ అంచనా వేశారు: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్
Finch On Warner: టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2021) కొత్త ఛాంపియన్ గా ఆస్ట్రేలియా టీమ్ అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ టీమ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. అయితే ఈ విజయం పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫించ్.. తమ టీమ్ లోని ప్రతి ఆటగాడి కృషిని మెచ్చుకున్నాడు. అదే విధంగా ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ మార్ష్, వేడ్ లపై ప్రశంసలు కురిపించాడు. అయితే ఇటీవలే వార్నర్ ఫామ్ పై వస్తున్న విమర్శలపై ఫించ్ స్పందించాడు. 
“ఎంతో గర్వంగా ఉంది. తొలి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని మా దేశానికి (ఆస్ట్రేలియా) అందించిన టీమ్ గా చరిత్రలో మేము నిలిచిపోతాం. ఈ ట్రోఫీ సాధించడం అంత తేలికైన విషయం కాదని మాకు తెలుసు. వ్యక్తిగతంగా, సమష్టిగా అద్భుత ప్రదర్శన కనబరిచి ఇక్కడి దాకా చేరుకున్నాం. వార్నర్​ ఫామ్​పై అందరూ కామెంట్స్​ చేశారు. కానీ, అతడు ఫామ్​లోకి వచ్చి తనేంటో నిరూపించుకున్నాడు. వార్నర్​ను కామెంట్​ చేయడం అంటే ఎలుగుబంటితో ఆటలాడటం లాంటిదే. నా దృష్టిలో ఆడమ్ జంపానే ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నమెంట్. మిచెల్​ మార్ష్​ అద్భుత ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. స్టోయినిస్, వేడ్​ బాగా ఆడారు" అని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. 
వార్నర్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ

దుబాయ్ వేదికగా ఆదివారం (నవంబరు 14) న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో ఆస్ట్రేలియా (NZ Vs AUS T20 Final) 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో 53 పరుగులు), మిచెల్‌ మార్ష్‌ (50 బంతుల్లో 77 పరుగులు, నాటౌట్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వార్నర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలవగా..  మార్ష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

Also Read: T20 World Cup Final: టీ20 వరల్డ్​కప్​ను తొలిసారి ముద్దాడిన ఆస్ట్రేలియా

Also Read: Nathan Lyon On India: ‘స్వదేశంలో టీమ్ఇండియాను ఓడించాలి.. అదే నా అతిపెద్ద లక్ష్యం’

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News