Shoaib Akhtar said Pakistan was waiting to face India in T20 World Cup 2022 Final: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్ ప్రస్థానం ముగిసిన విషయం తెలిసిందే. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 10 వికెట్ల తేడాతో దారుణ ఓటమిని ఎదుర్కొని పొట్టి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్ బెర్త్ ఖాయమని భావించిన భారత్  ఎవరూ ఊహించని విధంగా సెమీస్ నుంచి ఇంటిదారి పట్టగా.. కచ్చితంగా ఇంటికెళుతుందని భావించిన పాకిస్థాన్‌ మాత్రం అద్భుత ఆటతో అనూహ్యంగా ఫైనల్ చేరింది. దాంతో మెగా సమరంలో చిరకాల ప్రత్యర్థుల మధ్యే పోరు అని భావించిన వారికి నిరాశే ఎదురైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022లో తనతో సమానమైన ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీమిండియాపై పలువురు భారత క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పాకిస్తాన్ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఊరుకుంటాడా. భారత ప్రదర్శనపై అక్తర్‌ విమర్శల వర్షం కురిపించాడు. ఫైనల్‌లో భారత్‌తో తలపడాలని పాకిస్తాన్ వేయి కళ్లతో ఎదురుచూసిందని, ఇక అది సాధ్యం కాదని ఎద్దేవా చేశాడు. భారత్‌ చాలా చెత్త ఆట ఆడిందని.. ఇంగ్లండ్‌పై ఓటమికి వారు అర్హులే అని పేర్కొన్నాడు. 


షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. 'టీమిండియాకు ఇది అత్యంత దారుణమైన ఓటమి. ఇంగ్లండ్‌పై ఓటమికి వారు అర్హులే. ఫైనల్‌కు చేరే అర్హత భారత్‌కు లేదు. జట్టులో బౌలింగ్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియాలోని పరిస్థితులు ఫాస్ట్‌ బౌలింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉంటాయి. భారత జట్టులో సరైన పేసర్‌ లేడు. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ ఒక్క మ్యాచ్‌ ఆడలేదు. భారత టీమ్‌ సెలక్షన్‌ గందరగోళంగా ఉంది' అని అక్తర్ అన్నాడు. 



'మెగా టోర్నీలో మ్యాచ్‌లు గెలిచేంత దూకుడు భారత జట్టులో కనిపించలేదు. ఇంగ్లండ్ బ్యాటర్లు తొలి ఐదు ఓవర్లలో బాడుతుంటే.. భారత్ చేతులెత్తేసింది. కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేదు. బౌలర్లు రౌండ్‌ ద వికెట్‌ బౌలింగ్ చేయాల్సింది. అలానే బౌన్సర్లు సంధించి ఉండాల్సింది. అలా చేయలేకపోయారు. భారత ఆటగాళ్లలో ఎలాంటి దూకుడు కనిపించలేదు. రోహిత్ శర్మ విఫలమయ్యాడు. హార్దిక్‌ పాండ్యా బాగా ఆడాడు. టీ20 ఫార్మాట్‌కు అతడు కెప్టెన్‌ కావొచ్చు' అని షోయబ్ అక్తర్ చెప్పాడు. 


Also Read: టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన.. గణాంకాలు చూస్తే అభిమాని గుండె బద్దలవ్వాల్సిందే!  


Also Read: T20 World Cup 2022: ఇంగ్లండ్‌పై భారత్ ఓడిపోవడమే మంచిదయ్యింది.. లేదంటేనా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook