Shoaib Akhtar: షోయబ్ అక్తర్ ఇంట విషాదం..విచారం వ్యక్తం చేసిన హర్భజన్
Shoaib Akhtar: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్తర్ తల్లి అనారోగ్యంతో ఆదివారం మరణించారు.
Shoaib Akhtar's mothers demise: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగా అక్తర్ తల్లి (Shoaib Akhtar's mothers demise) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు షోయబ్. ఆమె అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లో జరగనున్నాయి. కాగా అక్తర్ తల్లి మృతికి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, షోయబ్ మాలిక్‌తో పాటు పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు.
"ఈ క్లిష్ట సమయంలో మీకు అల్లా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఆమె కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని హర్భజన్ సింగ్ (Harbhajan Singh ) ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు భజ్జీ.
Also Read: Yuvraj singh: స్పేస్‌లోకి యువరాజ్ సింగ్ తొలి సెంచరీ బ్యాట్, వీడియో వైరల్
2011 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు వీడ్కోలు పలికాడు షోయబ్ అక్తర్. 224 ఇంటర్నేషనల్ మ్యాచ్స్ ఆడిన అతడు 4444 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ లో అత్యంత వేగం(161.3కిమీ)తో బౌలింగ్ చేసిన బౌలర్ గా షోయబ్ కు రికార్డు ఉ్ంది. ఇప్పుడు వ్యాఖ్యాతగా అలరిస్తున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి