Shoaib Malik Creates history: గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్న షోయబ్ మరోసారి ట్రెండింగ్ అయ్యాడు. నిన్న మూడో పెళ్లితో .. ఇవాళ టీ20ల్లో రికార్డు సృష్టించి వార్తల్లో నిలిచాడు. తాజాగా పొట్టి ఫార్మాట్‌లో 13 వేల ప‌రుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్ గా... అంతర్జాతీయంగా రెండో ఆటగాడిగా షోయబ్ గుర్తింపు పొందాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి స్థానంలో వెస్టిండీస్ మాజీ ఓపెనర్  క్రిస్ గేల్(Chris Gayle) ఉన్నాడు. ఇతడు 14562 రన్స్ చేశాడు.  ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఫార్చ్యూన్ బరిషల్(Fortune Barishal) జట్టు తరుపున ఆడుతున్నాడు. అయితే తాజాగా మాలిక్ రంగాపూర్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో 17 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీ20 ఫార్మాట్ లో 13 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా షోయబ్ నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 


శనివారం షోయబ్ మూడో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా రెండో భార్య సానియా మిర్జా(Sania Mirza)కు దూరంగా ఉంటున్న అత‌డు.. శనివారం పాక్ నటి స‌నా జావెద్‌(Sana Javed)ను పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను ‘''అహ్మ‌దుల్లా.. మేము ఒక్క‌ట‌య్యాం''’ అని క్యాప్ష‌న్‌తో ఇన్‌స్టాలో షేర్ చేశాడు. సానియా కంటే ముందు మాలిక్ హైద‌రాబాద్‌కే చెందిన‌ అయేషా సిద్దిఖీ(Ayesha Siddiqui)కి 2002లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2010లో ఆమెకు కటీఫ్  చెప్పి సానియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇజాన్(Izhaan) అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. 


అయితే వీరిద్దరూ కొంత కాలం దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో వీరు వివాహ బంధానికి స్వస్తి చెప్పనున్నారనే వార్తలు కొన్ని రోజులుగా నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. అయితే షోయబ్, సానియా మాత్రం దీనికి సంబంధించిన వివరాలను ఎక్కడ వెల్లడించలేదు. అయితే ష‌రియా చ‌ట్టంలోని ఖులా ప‌ద్ధ‌తిలో షోయ‌బ్‌కు సానియా విడాకులు ఇచ్చింద‌ని ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జా తెలిపాడు.


Also Read: U19 World Cup 2024: వరల్డ్ కప్ లో టీమిండియా శుభారంభం.. తొలిపోరులో బంగ్లాను చితక్కొటిన యువ భారత్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook