Maha Yoga effect: సంక్రాంతి తర్వాత ఈ 5 రాశులకు పట్టిన కుబేర యోగం.. మీ రాశి ఉందా?

Maha Yoga effect: జనవరిలో సంక్రాంతి తర్వాత కొన్ని కీలక గ్రహ సంచారాలు జరిగాయి. దీంతో 5 రాశులవారు చాలా ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 06:45 PM IST
Maha Yoga effect: సంక్రాంతి తర్వాత ఈ 5 రాశులకు పట్టిన కుబేర యోగం.. మీ రాశి ఉందా?

Grah Gochar in January 2024: ఈ ఏడాది సంక్రాంతి తర్వాత కొన్ని గ్రహాల గమనంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కుంభరాశిలో శని, మకరరాశిలో సూర్యుడు, ధనస్సులో బుధుడు, కుజుడు సంచరించాడు. దీంతో కొన్ని రాశులవారు జాతకంలో మహాయోగం రూపొందింది. ఈ గ్రహ సంచారాల వల్ల 5 రాశుల వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

సింహ రాశి (Leo):  సింహరాశి వారికి మహాయోగం శుభప్రదంగా ఉంటుంది. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది.
కన్య రాశి (Virgo): మకరరాశిలో సూర్యుని సంచారం కన్యారాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. 
ధనస్సు రాశి (Sagittarius): ఈ రాశి వారికి గ్రహాల సంచారం బాగుంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు తిరుగులేని లాభాలను ఇస్తాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ వైవాహిక జీవితం అద్బుతంగా ఉంటుంది. 

Also read: Budh gochar 2024: మకరరాశిలోకి ప్రవేశించబోతున్న బుధుడు.. ఈ 4 రాశులవారు జాగ్రత్త..

మేష రాశి (Aries): గ్రహాల ఏర్పరచిన మహాయోగం వల్ల మేషరాశి వారిని అదృష్టం వరించనుంది. బిజినెస్ ప్రారంభించే వారికి ఇదే మంచి సమయం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
మిథున రాశి (Gemini): మిథునరాశి వారికి మహాయోగం అద్భుతంగా ఉండబోతుంది. మీ దాంపత్య జీవితంలోని సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Mangal uday 2024: ధనుస్సు రాశిలో ఉదయించిన కుజుడు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News