India Vs Australia 2023: వన్డే ప్రపంచకప్‌ 2023 ఆస్ట్రేలియాతో ప్రారంభమైన మ్యాచ్‌కు ముందు భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు డెంగ్యూ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అనారోగ్యం కారణంగా శుభ్‌మన్ గిల్‌ తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, డెంగ్యూ జ్వరం వచ్చిన గిల్ గురువారం MA చిదంబరం స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు హాజరవలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. గిల్ ఈ మ్యాచ్ కు ఆడే పరిస్థి లేనందున అతడి ప్లేసులో కెఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్ చెన్నైలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన ODI సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. రెండు మ్యాచుల్లో 178 పరుగులు చేసి సీరీస్ కైవసం చేసుకోవటంలో కీలక పాత్ర పోషించాడు. 


మొహాలీలో జరిగిన సిరీస్ మొదటి మ్యాచ్‌లో రైట్‌హ్యాండర్ శుభ్‌మాన్ గిల్ 74 పరుగులు చేశాడు. దీంతో ఇండోర్‌లో తన కెరీర్‌లో ఆరవ ODI సెంచరీని సాధించడంతో ODI బ్యాటింగ్ విడుదల జాబితాలో కెరీర్-హై రేటింగ్‌ను సంపాదించాడు. 


Also Read: RBI Monetary Policy: వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. స్థిరంగా రెపో రేటు   


ఐసీసీ వెల్లడించిన నివేదికల ప్రకారం.. శుభమం గిల్ ఇపుడు 847 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు.  అక్టోబరు 5న ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు వరకు పాకిస్తాన్ బాబర్ కంటే కేవలం 10 రేటింగ్ పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. 


టీమ్ ఇండియా ప్రస్తుతం చెన్నైలో ఉంది. చాలా మంది క్రికెటర్లు గాయాల నుండి కోలుకొని తిరిగి జట్టులోకి వస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చారు.


Also Read: Mumbai Fire Incident: ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook