Should Virat Kohli Offer Captaincy to Rohith: టైటిల్ ఫేవరెట్​గా టీ20 వరల్డ్ కప్​లో అడుగు పెట్టిన టీమ్ ఇండియా (Team India Out of T20 World cup) సెమీస్​ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది. అఫ్గానిస్థాన్​పై న్యూజిలాండ్ నిన్న (NZ vs AFG) ఘన విజయం సాధించిన నేపథ్యంలో టీమ్​ ఇండియా సేమీస్ ఆశలు ఆవిరయ్యాయి. దీనితో నమీబియాతో నేడు టీమ్​ ఇండియా (India vs Namibia) నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరల్డ్ కప్​ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli To Step Down As India's T20 Captain) తప్పుకోనున్నాడు. అంటే కెప్టెన్​గా నేడు జరిగేది కోహ్లీకి చివరి మ్యాచ్​. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భారత మాజీ క్రికెటర్​ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar on Kohli) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


ఈ మ్యాచ్​లో (ఇండియా-నమీబియా) కోహ్లీ తనంతట తానే.. రోహిత్​ శర్మకు కెప్టెన్సీ (Rohith Sharma) బాధ్యతలు అప్పపగించాలని సూచించాడు. ఇది కొత్త ట్రెండ్ అవుతుందన్నాడు మంజ్రేకర్​. ఇలా చేస్త.. విశ్రాంతి పేరిట తనను పక్కన పెట్టరని అభిప్రాయపడ్డాడు.


తరువాతి కెప్టెన్​ ఎవరు?


కోహ్లీ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరనేదానిపై ప్రస్తుతం (Team India new Captain) తీవ్ర చర్చ సాగుతోంది. ఈ రేసులో ప్రస్తుత వైస్​ కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్​, రిషబ్​ పంత్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి.


Also read: T20 World Cup 2021: విరాట్ కోహ్లీ తరువాత టీమ్ ఇండియా సారధ్యం ఎవరు


అయితే రోహిత్​ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం లాఛనమేనని అభిప్రాయపడుతున్నారు. అయితే అతడి వయసును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను కెప్టెన్​గా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


అయితే టీమ్ ఇండియా మాజీ బౌలర్ ఆశిశ్ నెహ్రా ఓ కొత్త పేరును తెరపైకి తెచ్చాడు. టీమ్ ఇండియా పేసర్​ బుమ్రాకు కెప్టన్ అయ్యే అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. పేసర్​ కెప్టెన్ అవ్వొద్దనే రూల్ ఎక్కడా లేదని కూడా స్పష్టం చేశాడు.


త్వరలోనే బీసీసీఐ నిర్ణయం..


టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం.. టీమ్ ఇండియా న్యూజిలాండ్​తో 3 టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్​లు (India vs Nz) ఆడనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బీసీసీఐ కొత్త కెప్టెన్ ఎంపికపై (BCCI) నిర్ణయం తీసుకోనుంది.


Also read: Virat Kohli: టీమ్ ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రయాణం విజయవంతమా, విఫలమా


Also read: Ashish Nehra: 'టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​గా ఆ పేసర్​కు అర్హతలున్నాయ్'


టీమ్ ఇండియా సేమీస్ ఎందుకు చేరలేదు?


టీ20 వరల్డ్ కప్​లో భాగంగా భారత్​ తొలుత (India vs Pak) పాకిస్థాన్​తో, రెండో మ్యాచ్​ను న్యూజిలాండ్​తో (India vs NZ) ఆడింది. అయితే ఈ రెండు మ్యాచుల్లో భారత్​ ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత అప్గానిస్థాన్​, స్కాట్​లాండ్​లతో జరిగిన మ్యాచుల్లో ఘన విజయం సాధించింది.


అయితే తొలి రెండు మ్యాచుల్లో పరాజయం పాలైనందున.. సెమీస్  చేరాలంటే.. ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. నిన్న అప్ఘానిస్థాన్​పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో టీమ్ ఇండియా సేమీస్ ఆశలకు గండి పడింది. మొదటి రెండు మ్యాచుల్లో ఒక్కదాంట్లోనైనా విజయం సాధించి ఉంటే.. టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Also read: Watch Video: కివీస్ ఆటగాడు అద్భుత ఫీల్డింగ్..క్యాచ్ విడిచిపెట్టినా హీరో అయ్యాడంటూ నెటిజన్స్ కామెంట్స్..


Also read: Rashid khan: ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు, మరెవరికీ సాధ్యం కాని రికార్డు


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook