Watch Video: కివీస్ ఆటగాడు అద్భుత ఫీల్డింగ్..క్యాచ్ విడిచిపెట్టినా హీరో అయ్యాడంటూ నెటిజన్స్ కామెంట్స్..

అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ చేసిన ఫీల్డింగ్ కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. క్యాచ్ పట్టకపోయినా హీరో అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2021, 08:57 PM IST
Watch Video: కివీస్ ఆటగాడు అద్భుత ఫీల్డింగ్..క్యాచ్ విడిచిపెట్టినా హీరో అయ్యాడంటూ నెటిజన్స్ కామెంట్స్..

T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా..ఆదివారం అబుదాబి(Abu Dhabi)లోని షేక్ జాయెద్ స్టేడియంలో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో కివీస్ ఆటగాడు డారిల్ మిచెల్(Daryl Mitchell) కొంత కాలం గుర్తిండిపోయే ఫీల్డింగ్ చేశాడు. అతను క్యాచ్‌(Catch) తీసుకొని ఉంటే మాత్రం క్రికెట్‌ చరిత్రలో మిగిలిపోయేది. 

వివరాల్లోకి వెళితే..
జేమ్స్ నీషమ్ వేసిన 19వ ఓవర్ మొదటి బంతిని రషీద్ ఖాన్(Rashid Khan) డీప్ మిడ్-వికెట్ మీదుగా సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. బౌండరీలైన్‌ వద్ద ఉన్న డారిల్‌ మిచెల్‌ గాల్లోకి ఎగురుతూ బంతిని ఒంటిచేత్తో అందుకున్నాడు. అయితే పట్టుతప్పి బౌండరీ లైన్‌మీద పడే అవకాశం ఉండడంతో అతను కిందపడేలోపే బంతిని బౌండరీ ఇవతలకు విసిరాడు. దీంతో ఆరు పరుగులు వచ్చే చోట కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చేలా చేశాడు. దీంతో మిచెల్‌ ఫీల్డింగ్‌(Fielding)కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‎గా మారింది.

Also read: NZ vs AFG: అఫ్గానిస్థాన్​పై న్యూజిలాండ్ ఘన విజయం- భారత్​ సెమీస్​ అవకాశాలకు గండి

ఈ మ్యాచ్‎లో ఆఫ్ఘానిస్తాన్(Afghanistan) 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ 73 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక న్యూజిలాండ్(New Zealand) బౌలర్లలో టిమ్ సౌతీ 2, ట్రెంట్ బౌల్ట్ 3, మిల్నే, నీషమ్, సోధి తలో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కేవలం 18.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కివీస్ ఆటగాళ్లలో గప్టిల్(28), విలియమ్సన్(40),  డేవాన్ కాన్వే(36) రాణించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News