Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ బ్యాడ్ లక్.. అనుకోకుండా పెవిలియన్‌కు..
Shreyas Iyer Hit Wicket Video: న్యూజిలాండ్ టూర్లో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. రెండో టీ20 మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది.సూర్యకుమార్ 111 రన్స్‌తో చెలరేగి ఆడాడు.
Shreyas Iyer Hit Wicket Video: సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేడంతో న్యూజిలాండ్‌పై టీమిండియా 65 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం కివీస్ 18.5 ఓవర్లలో 126 రన్స్‌కే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ హ్యాట్రిక్ వికెట్లు తీయగా.. టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా నాలుగు వికెట్లతో చెలరేగాడు.
ఇక మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అనుకోకుండా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. 9 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 13 పరుగులు చేసిన శ్రేయాస్.. మంచి ఇన్నింగ్స్ ఆడేలానే కనిపించాడు. 13వ ఓవర్‌లో ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అతను డీప్ స్క్వేర్ లెగ్ వైపు సింగిల్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు చాలా వెనుకకు వెళ్లగా.. పాదం స్టంప్‌లను తాకింది. అయ్యర్ పరుగు కోసం పరిగెత్తినప్పుడు.. ఫీల్డర్లు ఔట్ అని సంబురాలు చేసుకోవడంతో అతనికి అర్థం కాలేదు.
వెనుతిరిగి చూస్తే.. బెయిల్స్ కింద పడిపోయి ఉన్నాయి. హిట్ వికెట్ అయ్యాయనని తెలుసుకుని.. తనపైనే కోపం తెచ్చుకుని పెవిలియన్‌కి వెళ్లిపోయాడు. అయ్యర్ ఔట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిట్ వికెట్ అయిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 25వ బ్యాట్స్‌మెన్.
సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించాడు. కేవలం 51 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ఈ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. 2018లో రోహిత్ శర్మ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు టీ20 సెంచరీలు చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సూర్యకుమార్ తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 11 ఫోర్లతో 217.65 స్ట్రైక్ రేట్‌తో శతక్కొట్టాడు.
Also Read: Suryakumar Yadav: న్యూజిలాండ్‌పై చితకబాదిన సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మ రికార్డు సమం
Also Read: Andrila Sharma: ఇండస్ట్రీలో మరో విషాదం.. 24 ఏళ్ల నటి దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook