Shreyas Iyer thanks Suryakumar Yadav for backing him During His Ranji Trophy debut: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer) సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్టులోనే సెంచరీ (105; 171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సులు) చేసి అందరిని ఆకట్టుకున్నాడు. అరంగేట్రంలోనే సెంచరీ (Test debut Century) చేసిన 16వ టీమిండియా ఆటగాడిగా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. స్టార్ బ్యాటర్లు విఫలమయిన సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. కాన్పూర్‌ టెస్టు (Kanpur Test)లో అరంగేట్రం చేసిన తర్వాత శ్రేయాస్ టెస్ట్ క్రికెట్ ఆడాలనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత శ్రేయాస్ ఈ విషయాన్ని చెప్పాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నా చిన్ననాటి కల:
రెండో రోజు ఆట ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో తోటి ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav)తో శ్రేయాస్ అయ్యర్ సంభాషించాడు. ఈ సందర్భంగా 2014లో ఇదే కాన్పూర్‌ వేదికపై తన రంజీ ట్రోఫీ అరంగేట్రం (Ranji Trophy debut)ను శ్రేయాస్ గుర్తుచేసుకున్నాడు. 'టెస్ట్ క్రికెట్ ఆడాలనేది నా చిన్ననాటి కల. కానీ ప్రస్తుత పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. నేను మొన్నటివరకు టీ20లు, వన్డేలు మాత్రమే ఆడాను. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడాను. టెస్ట్ క్రికెట్ ఆడడం ఆలస్యం అయిందని నేను అనుకోవట్లేదు. టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడిని ఇంతకంటే మంచిదేమీ నేను అడగలేదు' అని అయ్యర్ తెలిపాడు. 


Team India : దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభణతో టీమ్‌ ఇండియా పర్యటనపై అనుమానాలు


సూర్య భాయ్ వల్లే:
'కాన్పూర్ స్టేడియం (Kanpur Stadium) నాకు నిజంగా కలిసొచ్చింది. నా లక్కీ స్టేడియం అని చెప్పొచ్చు. నా తొలి రంజీ సీజన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) కెప్టెన్‌ కెప్టెన్సీలో ఆడాను. మొదటి నాలుగు ఇన్నింగ్స్‌ల తర్వాత ఇక నాకు జట్టులో చోటు ఉండదు అని అనుకున్నా. కానీ సూర్య నాకు మద్దతు ఇచ్చాడు. అందుకు అతడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. సూర్య భాయ్ వల్లే టెస్ట్ క్రికెట్ ఆడుతున్నా. అప్పుడు 20-30 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో నేను టెయిల్ ఎండర్స్‌తో కలిసి 150 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాను. దాంతో జట్టు మంచి స్థానానికి చేరుకుంది' అని శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు. 


Karthikeya Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో హీరో కార్తికేయ దంపతులు.. ఫొటోలు వైరల్


డిన్నర్‌కి ఆహ్వానించా:
'కోచ్‌ ప్రవీణ్ (Pravin) సర్‌ నన్నెంతో ప్రోత్సహించారు. జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉందని ఎప్పుడూ చెబుతుంబడేవారు. టీమిండియా తరఫున టెస్టు క్రికెట్‌ క్యాప్ (Test Cap) అందుకోవడం జీవితంలో గొప్ప విజయమని చెప్పారు. ఇప్పడు నేను టెస్టు క్యాప్ అందుకోవడం, తొలి టెస్టులోనే సెంచరీ చేయడం చూసి ప్రవీణ్ సర్‌ సంతోషించి ఉంటారు. టెస్టు క్రికెట్లో సెంచరీ చేసిన తర్వాతే నీతో డిన్నర్‌కి వస్తానని ఒకప్పుడు నాతో అన్నారు. సెంచరీ చేసిన తర్వాత ఆయనకు మెసేజ్‌ చేసి డిన్నర్‌కి ఆహ్వానించా. చాలా ఆనందించారు. ఇక మా నాన్నకు టెస్టు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. నేను చేసిన సెంచరీని ఆయనకు అంకితం ఇస్తున్నా. నా జీవితంలో సాధించిన గొప్ప విజయం ఇదే. నా క్రికెట్ కెరీర్‌లో తల్లిదండ్రుల పాత్ర మరువలేనిది' అని శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) చెప్పుకొచ్చాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook