Rahane-Pujara likely to be Replaced With Vihari-Gill: రోహిత్ శర్మ కెప్టెన్సీ అందుకున్నాక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌పై వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. శ్రీలంకపై టీ20 సిరీస్‌ను సాధించింది. ఇక మార్చి నాలుగు నుంచి లంకతో రెండు టెస్టులు ఆడనుంది. దాంతో భారత జట్టుకు తొలిసారి టెస్టుల్లో సారథ్యం వహించనున్నాడు. అయితే సీనియర్ ఆటగాళ్లు జట్టులో చోటు కోల్పోవడంతో.. భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొంత కాలంగా వరుసగా విఫలమవుతున్న టీమిండియా సీనియర్‌ టెస్ట్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారాలను శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు బీసీసీఐ దూరం పెట్టింది. ఈ రెండు స్థానాలకు శుభ్‌మన్‌ గిల్, హనుమ విహారి, శ్రేయస్‌ అయ్యర్‌ పోటీ పడుతున్నారు. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ రానున్న నేపథ్యంలో గిల్‌ మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్-ఎ జట్టు తరఫున కూడా అతడికి మూడవ స్థానంలో ఆడిన అనుభవం ఉంది. మూడో స్థానంలో శుభ్‌మన్ బెటర్ ఆప్షన్ అని భారత మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ కూడా అన్నారు. 


నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. అజింక్య రహానే బ్యాటింగ్ చేసే ఐదో స్థానంలో రిషభ్‌ పంత్‌ బరిలోకి దిగనున్నాడు. టాప్ ఆర్డర్‌లో అందరూ రైట్ హ్యాండర్స్ ఉండడంతో పంత్‌ను ఐదవ స్థానంలో దింపాలని దేవాంగ్ గాంధీ సూచించారు. అలా అయితే ఆరో స్థానంలో హనుమ విహారి ఆడనున్నాడు. దాంతో శ్రేయస్‌ అయ్యర్‌కి చోటు దక్కడం కష్టమే. విహారి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలడు కాబట్టి ఆరో స్థానంలో అతడే సరైన ఎంపిక అని గాంధీ పేర్కొన్నారు.


ఆపై రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేయనున్నారు. ఆల్‌రౌండర్‌గా జడేజా జట్టుకు సేవలు అందించనున్నాడు. మ్యాచ్ గమనాన్ని బట్టి అతడు బ్యాటింగ్‌లో ప్రొమోషన్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సొంత గడ్డపై ముగ్గురు స్పినర్లతో బరిలోకి దిగాలని రోహిత్ శర్మ ఆశిస్తే.. జయంత్ యాదవ్ జట్టులోకి రానున్నాడు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌ ఆడనున్నారు. మూడో స్పిన్నర్ అవసరం అయితే ఇందులో ఒకరిపై వేటు పడనుంది. 


Also Read: Gold Rate Today 1 March 2022: మగువలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు!!


Also Read: Amul hikes milk prices: పాల ధర పెంచేసిన అమూల్.. లీటర్ కు ఎంత పెంచారంటే.. ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook