Shubman Gill - Sara Tendulkar Viral Video: టీమిండియా ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ - సారా టెండూల్కర్ మధ్య ప్రేమ వ్యవహారం గురించి చాలానే పుకార్లు వింటున్నాం. వీరిద్దరూ చాలా సార్లు కలిసి కనిపించటం , కెమెరాలకు చిక్కటం వలన పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి. సారా టెండూల్కర్ అనే కాదు కానీ బాలీవుడ్లో చాలా మంది స్టార్స్ తో గిల్ కి పరిచయాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. జియో వరల్డ్ ప్లాజా లాంచ్ ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించినపుడు కూడా  వీరి ప్రేమ గురించి చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇద్దరు కెమెరాలను చూడగానే దాక్కోటానికి ప్రయత్నించారు కానీ కెమెరాకి దొరికిపోయారు. ముంబై ఇండియన్స్ యజమాని ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ ప్లాజాలో శుభమాన్ గిల్ మరియు సారా టెండూల్కర్ కలిసి డిన్నర్ చేశారనేది నిజం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోసారి చిక్కిన శుభమన్ గిల్ & సారా టెండూల్కర్.. 
ఒకవైపు ICC ODI ప్రపంచ కప్ 2023 మన దేశంలో నిర్వచించబడుతున్న సంగతి తెలిసిందే! మరోవైపు భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శుభమన్ గిల్ ప్రపంచ కప్ 2023 జరుగుతున్న మధ్యలో పార్టీకి హాజరయ్యేందుకు ముంబై చేరుకున్నాడు. ఇక అసలు విషయం ఏంటంటే.. శుభమన్ గిల్ హాజరైన అదే పార్టీలో సారా టెండూల్కర్ కూడా కనిపించింది. పార్టీ నుండి ఇద్దరు విడివిడిగా బయటకు వచ్చినప్పటికీ.. కాసేపటి తరువాత ఇద్దరు కలిసి కన్పించారు. 


'జియో వరల్డ్ ప్లాజా'లో కనిపించిన సారా & శుభమన్
ముంబైలో జియో వరల్డ్ ప్లాజా లగ్జరీ మాల్ ప్రారంభించబడింది. ఈ లాంచ్ ఈవెంట్‌లో, అంబానీ కుటుంబంతో పాటు మొత్తం బాలీవుడ్ స్టార్ లతో పాటు చాలా మంది క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. వారిలో ఒకరు శుభ్‌మాన్ గిల్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో శుభ్‌మన్ స్నేహితురాలు సారా టెండూల్కర్‌తో కలిసి కనిపించారు. వీడియోలో సారా టెండూల్కర్ - శుభ్‌మాన్ గిల్ 'జియో వరల్డ్ ప్లాజా'లో ఈవెంట్ నుండి బయటకు వస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే వాళ్లు.. బయట ఉన్న మీడియాని చూడగానే అక్కడే ఆగిపోయారు. తరువాత ఇద్దరు విడివిడిగా భయటకి వచ్చారు. మీడియాకు కనపడకుండా ఉండటానికి ప్రయత్నించారు.. కానీ చివరగా కెమెరాకి చిక్కారు. ఈ పార్టీకి సారా రెడ్ డౌన్ లో రాగా.. బ్లాక్ సూట్ లో శుభమన్ వచ్చారు. 


Also Read: New Rules From Today: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. తప్పకుండా తెలుసుకోండి..!  



సంతోషంలో అభిమానులు.. 
ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒక వ్యక్తి “మీడియాని చూసి శుభమన్ దాక్కున్నాడు"  అని ఒకరు కామెంట్ చేయగా.. "సారా - శుభ్‌మన్ ఇద్దరు చాలా అందంగా ఉన్నారు." అని కామెంట్ చేయగా మరొకరైతే.. "సారా - శుభ్‌మాన్ మంచి స్నేహితులు అని నేను భావిస్తున్నాను." అని కామెంట్ చేసారు.  ఇంతకుముందు కూడా చాలా సార్లు సారా - శుభ్‌మాన్ కలిసి కన్పించారు. ఆ మధ్య కొన్ని రోజులు వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.. ఇద్దరు విడిపోయారాని పుకార్లు వచ్చాయి. వీరిద్దరి మధ్యలోకి సారా అలీ ఖాన్ కూడా వచ్చింది. 


Also Read: Best Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో Panasonic 6 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ రూ.7,190కే..ఫీచర్స్‌, డిస్కౌంట్ వివరాలు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..