SL vs IND 2021: Hardik Pandya బౌలింగ్ చేస్తే Virat Kohli జాబ్ ఈజీ: అజిత్ అగార్కర్
SL vs IND 2021, Hardik Pandya’s bowling useful for Virat Kohli: Ajit Agarkar: హార్థిక్ పాండ్య బౌలింగ్ చేస్తే విరాట్ కోహ్లీకి తన పని సులువు అవుతుందని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. మోడర్న్ డే క్రికెట్‌లో బౌలర్స్ పని అంత సులువేమీ కాదన్న అజిత్ అగార్కర్.. పాండ్య బౌలింగ్ చేయడం ప్రారంభిస్తే టీమిండియాకు అతడు 6వ బౌలింగ్ ఆప్షన్‌గా నిలుస్తాడని పేర్కొన్నాడు.
SL vs IND 2021, Hardik Pandya’s bowling useful for Virat Kohli: Ajit Agarkar: హార్థిక్ పాండ్య బౌలింగ్ చేస్తే విరాట్ కోహ్లీకి తన పని సులువు అవుతుందని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. మోడర్న్ డే క్రికెట్‌లో బౌలర్స్ పని అంత సులువేమీ కాదన్న అజిత్ అగార్కర్.. పాండ్య బౌలింగ్ చేయడం ప్రారంభిస్తే టీమిండియాకు అతడు 6వ బౌలింగ్ ఆప్షన్‌గా నిలుస్తాడని పేర్కొన్నాడు. ఇండియన్ బ్యాట్స్‌మెన్‌లో ఏ ఒక్కరు కూడా పార్ట్‌టైమ్ బౌలర్స్ లేకపోవడం విరాట్ కోహ్లీకి ఇబ్బందికరమైన పరిణామం. అందుకే హార్ధిక్ పాండ్య బౌలింగ్ చేయడం మొదలుపెడితే.. విరాట్ కోహ్లీకి కెప్టేన్సీ జాబ్ కొంత ఈజీ అవుతుందని అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చెప్పాడు. శ్రీలంక - ఇండియా సిరీస్ అఫిషియల్ బ్రాడ్‌కాస్ట్ పార్ట్‌నర్ అయిన సోని ఇండియాకు ఇచ్చిన వర్చువల్ పీసీలో అజిత్ అగార్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
వెన్నుపూస సర్జరీ తర్వాత హార్థిక్ పాండ్య (Hardik Pandya’s back surgery) పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేదు. ఇంగ్లాండ్‌తో చివరి వన్డేలో చివరిసారిగా బౌలింగ్ చేసిన హార్థిక్ పాండ్య ఐపిఎల్ 2021 (IPL 2021) తొలి దశలో ముంబై ఇండియన్స్ తరపున ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. అయితే, తాజాగా శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌లో (SL vs IND ODI series 2021) తాను బౌలింగ్ చేయనున్నట్టు స్వయంగా హార్థిక్ పాండ్య వైపు నుంచే ప్రకటన రావడంపై స్పందిస్తూ అజిత్ అగార్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Also read : MS Dhoni New Look: చిన్ననాటి స్నేహితులతో ఎంఎస్ ధోనీ లంచ్, సోషల్ మీడియాలో ఫొటో వైరల్
హార్థిక్ పాండ్య బౌలింగ్‌పై టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందిస్తూ.. పాండ్య బౌలింగ్ చేయడం మొదలుపెట్టడం అనేది టీమిండియాకు ఒక రకంగా శుభసూచకమే అని అన్నాడు.
Also read: Tokyo Olympics 2021: స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ Roger Federer కీలక నిర్ణయం, అభిమానులు షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook