Snake On Field: రెండో టీ20 చూడ్డానికి వచ్చిన ప్రత్యేక అతిథి.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు (వీడియో)!
Snake enters Guwahati Stadium in India vs South Africa 2nd T20. దక్షిణాఫ్రికా, భారత్ జట్ల గువాహటిలో జరుగుతున్న రెండో మ్యాచ్ చూడడానికి బర్సపరా క్రికెట్ స్టేడియంలోకి ప్రత్యేక అతిథి వచ్చింది.
India vs South Africa 2nd T20 interrupted after Snake enters Guwahati Stadium: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల గువాహటిలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చూడడానికి బర్సపరా క్రికెట్ స్టేడియంలోకి ప్రత్యేక అతిథి వచ్చింది. ప్రత్యేక అతిథి అంటే.. ఏ రాజకీయ నాయకుడో లేదా స్టార్ హీరో, హీరోయిన్ అని అనుకున్నారో మీరు పొరపడినట్టే. మైదానంలోకి వచ్చింది పాము. భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ముగిశాక మైదానంలోని ఓ భారీ పాము దూసుకొచ్చింది.
భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ముగిశాక మైదానంలోని ఓ భారీ పాము వచ్చింది. మైదానం మధ్యలోంచి బౌండరీ వద్దకు దూసుకెళ్లింది. పాముని చూసిన మైదానంలోని ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మైదానంలోకి పరుగెత్తుకొంటూ వచ్చి పామును పట్టేశారు. పాము మైదానంలోకి రావడంతో మ్యాచుకు కాసేపు అంతరాయం కలిగింది. సిబ్బంది పామును పట్టాక మ్యాచ్ మళ్లీ మొదలైంది. పాముకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండో టీ20 చూడ్డానికి వచ్చిన ప్రత్యేక అతిథి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రెండో టీ20 మ్యాచులో భారత బ్యాటర్లు చెలరేగుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ షాట్లతో అలరించి (43) అర్ధ శతకం ముందు పెవిలియన్ చేరాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (56) హాఫ్ సెంచరీ బాది ఔట్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసి టీమిండియాకు భారీ స్కోర్ అందిస్తున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతున్నాడు. భారత్ 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 194 రన్స్ చేసింది. క్రీజులో కోహ్లీ (33), సూర్య (55) ఉన్నారు.
Also Read: టీమిండియా కెప్టెన్‌గా ధావన్.. ముకేష్ కుమార్‌కు జట్టులో చోటు! స్టార్ ప్లేయర్స్ ఔట్
Also Read: Kissing Cobra Goes Wrong: నాగు పామును ముద్దాడితే ఊకుంటుందా ? రివర్స్ లిప్ టూ లిప్ కిస్ ఇచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook