BCCI announce India Squad For South Africa ODI Series: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. నేడు రెండో టీ20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా.. అక్టోబరు 4 చివరి మ్యాచ్ ఆడుతుంది. అక్టోబరు 6న మూడు మ్యాచుల వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ వన్డే సిరీస్ కోసం సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ ఆదివారం ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్ 2022కు ఎంపికయిన ఆటగాళ్లెవరూ ఈ వన్డే సిరీస్ ఆడటం లేదు.
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ టీమ్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో టీ20 ప్రపంచకప్ 2022కు ఎంపికైన ప్లేయర్స్ ఆడడం లేదు. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న మెగా టోర్నీ కోసం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే (అక్టోబర్ 5) బయలుదేరనుంది. పాకిస్థాన్‌తో అక్టోబర్ 23న జరిగే తొలి మ్యాచ్‌కు ముందు భారత్ వామప్ మ్యాచ్‌లు ఆడనుంది.
సంజూ శాంసన్‌ను దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్‌కు పక్కన పెట్టడంతో వచ్చిన విమర్శల నేపథ్యంలో.. బీసీసీఐ అతడికి వన్డే సిరీస్‌లో చోటు కల్పించింది. ఐపీఎల్ టోర్నీలో మెరిసిన యువ ప్లేయర్స్ రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠికి స్థానం దక్కింది. కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, షహబాజ్ అహ్మద్‌లకు చోటిచ్చింది బీసీసీఐ. రజత్ పటిదార్, ముకేశ్ కుమార్‌లకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది.
🚨 NEWS 🚨: India’s squad for ODI series against South Africa announced. #TeamIndia | #INDvSA | @mastercardindia
— BCCI (@BCCI) October 2, 2022
భారత జట్టు:
శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, షహబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చహర్.
Also Read: Shanidev Signs: జీవితంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయా.. మీపై శని దేవుని ప్రభావం ఉన్నట్లే!
Also Read: అక్టోబర్ నెలలో శని ఈ రాశులపై ప్రభావం చూపించదా?.. అన్నీ శుభాలేనట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook