Sourav Ganguly ఐపిఎల్ 2022 గురించి, T20 World Cup 2021 ఏమంటున్నాడంటే..
Sourav Ganguly about IPL 2022 : ఐపిఎల్ 2021 టోర్నమెంట్ పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2022 సీజన్ గురించి బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
Sourav Ganguly about IPL 2022 : ఐపిఎల్ 2021 టోర్నమెంట్ కొంత భాగం భారత్‌లో జరిగితే.. కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఇంకొంత భాగం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఐపిఎల్ 2021 టోర్నమెంట్ పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2022 సీజన్ గురించి బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కనీసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 అయినా భారత్ గడ్డపైనే జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నానని సౌరబ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
IPL 2022 in India - భారత గడ్డపైనే ఐపిఎల్ 2022:
ఐపీఎల్ అంటేనే భారత్‌కి చెందిన టోర్నీ కనుక ఈ టోర్నమెంట్ భారత గడ్డపై జరిగితే బాగుంటుందనేదే ఇండియన్ క్రికెట్ లవర్స్ కోరికగా ఉంటుందని సౌరబ్ వ్యాఖ్యానించాడు. ఐపిఎల్ 2022 సీజన్‌కు ఇంకా 8 నెలల సమయం ఉందని చెప్పిన సౌరబ్.. ఆలోగా మన దేశంలో కరోనావైరస్ మహమ్మారి తగ్గి ఏపిఎల్ ఇక్కడే నిర్వహించుకునేలా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు.
Sourav Ganguly about T20 World Cup - టీ20 ప్రపంచ కప్‌పైనా సౌరబ్ వ్యాఖ్యలు:
టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీ20 ప్రపంచ కప్ జట్టులో సత్తా ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని, ఆటగాళ్లు కొంచెం పరిపక్వతతో ఉత్తమ ప్రదర్శన కనబరిస్తే టీ20 వరల్డ్ కప్ టైటిల్ సొంతం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదని సౌరభ్ గంగూలీ (Sourav Ganguly about T20 World Cup) అభిప్రాయపడ్డాడు. ఆరంభ మ్యాచ్‌లో గెలిచినంత మాత్రాన్నే ఛాంపియన్స్‌మి కాలేమని.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో గెలుస్తూ పోతేనే విజయం సొంతం అవుతుందని ఆటగాళ్లకు సూచించాడు.