క్రికెట్ (Cricket ) అభిమానులు చాలా కాలం నుంచి వేచి చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League ) త్వరలో ప్రారంభం కానుంది. మరో పది రోజుల్లో క్రికెట్ ప్రేమికుల ఇంట్లో ఐపీఎల్ మ్యాచులు సందడి చేయనున్నాయి. ఈ టోర్నీ ఏర్పాట్లను పరిశీలించడానికి బీసిసిఐ ( BCCI ) ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలి ( Sourav Ganguly ) షార్జా చేరుకున్నారు. దాని కన్నా ముందు అమీర్ షాహీలో గంగూలి కొన్ని రోజులు క్వారెంటైన్ లో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



భారత్ లో కరోనా వైరస్ ( Coronavirus ) వ్యాప్తి ఎక్కువగా ఉండటంటో ప్రభుత్వ అనుమతితో ఐపిఎల్ 2020ని భారత ప్రభుత్వం ఈ ఏడాది యూఏఈలో ( IPL in UAE ) నిర్వహిస్తోంది. ఈ సారి ఎమిరేట్స్ లోని దుబాయ్, అబు ధాబి, షార్జాలో మ్యాచులు జరగనున్నాయి.



సోమవారం రోజు సౌరభ్ గంగూలి షార్జా గ్రౌండ్ చేరుకుని అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డకు చెందిన అధికారులు కూడా అక్కడే ఉన్నారు. వారితో పాటు ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, గంగూలీతో మ్యాచులు జరిగే గ్రౌండ్ ను పరిశీలించారు. షార్జాలో అక్కడి నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను గంగూలి అభినందించారు.


కరోనావైరస్ మహమ్మారి ప్రభలుతున్న సమయంలో బీసీసీఐ ఎలాంటి రిస్కులు తీసుకోవాలి అని అనుకోవడం లేదు.  దీంతో ఈ యసారి ఐపిఎల్ మరింత ఛాలెంజింగ్ గా మారనుంది.